త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్ట‌ర్

ర‌ష్మిక మంద‌న్న కార‌ణంగా అల్లు అర్జున్ రాకా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అగ‌స్ట్‌లో ర‌ష్మిక మంద‌న్న ఈ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో భాగం కావాల్సింది. కానీ నేష‌న‌ల్ క్ర‌ష్ గాయ‌ప‌డ‌టంతో రాకా షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసిన‌ట్లు స‌మాచారం. ర‌ష్మిక కార‌ణంగానే ఈ సినిమా షూటింగ్ నెల‌న్న‌ర‌కుపైగా ఆల‌స్యం కానున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Aug 15, 2026, 2.51 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్ట‌ర్
Advertisement

Rashmika Mandanna |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న రాకా మూవీ షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిన‌ట్లు స‌మాచారం. ర‌ష్మిక మంద‌న్న కోసం ద‌ర్శ‌కుడు అట్లీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను వాయిదా వేసిన‌ట్లు చెబుతున్నారు. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న‌, జాన్వీ క‌పూర్‌, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

యోధురాలిగా...

దీపికా ప‌డుకోణ్ పాత్ర పురాణాల‌తో ముడిప‌డి సాగ‌గా...ఆమెకు ర‌క్ష‌కురాలిగా నిలిచే యోధురాలిగా ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జాన్వీ క‌పూర్ గిరిజ‌న జాతికి చెందిన యువ‌రాణి పాత్ర‌ను పోషిస్తుండ‌గా..మృణాల్ ఠాకూర్ మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది.

మైసా సాంగ్ షూట్‌లో ...

ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్ నుంచే రాకా షూటింగ్‌లో ర‌ష్మిక మంద‌న్న జాయిన్ కావాల్సింది. కానీ మైసా సాంగ్ షూట్‌లో గాయ‌ప‌డ‌టంతో కుద‌ర‌లేదు. దాంతో ఆమెపై చిత్రీక‌రించాల్సిన‌ షెడ్యూల్‌ను ద‌ర్శ‌కుడు అట్లీ క్యాన్సిల్ చేశాడ‌ట‌. ర‌ష్మిక పూర్తిగా కోలుకున్న త‌ర్వాతే సినిమాలో ఆమె పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను షూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ర‌ష్మిక మంద‌న్న రాకా సెట్స్‌లో అడుగుపెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అక్టోబ‌ర్‌లోనే రాకాకు గుమ్మ‌డికాయ కొట్టాల‌ని అట్లీ ప్లాన్ చేశారు. కానీ ర‌ష్మిక కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ నెల‌న్న‌రకుపైగా ఆల‌స్యం కానున్నట్లు స‌మాచారం.

ర‌ణ‌బాలి, మైసా..

రాకా ఒక్క‌టే కాకుండా ర‌ణ‌బాలి, మైసా షూటింగ్‌ల‌పై కూడా ర‌ష్మిక మంద‌న్న గాయం ఎఫెక్ట్ ప‌డింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేట‌ర్ల‌లోకి రావాల్సివుంది. స‌డెన్‌గా ర‌ష్మిక గాయ‌ప‌డ‌టంతో ఈ సినిమాల‌ షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఇప్ప‌టికే ర‌ష్మిక కార‌ణంగా ర‌ణ‌బాలి వాయిదాప‌డింది. మైసా అస‌లు ఈ ఏడాది రిలీజ్ అవుతుందా అన్న‌ది అనుమానంగా మారింది.రణబాలిలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే.

 

Advertisement
Advertisement