త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొడంగ‌ల్ లిఫ్ట్.. ఫేజ్-2 ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వండి

CM Revanth Reddy | కొడంగల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేశారు. ఈ సమీక్షలో ప‌నుల పురోగ‌తిని ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివ‌రించారు.

S

Telangana | Published On Sep 4, 2026, 9.52 pm IST

CM Revanth Reddy | కొడంగ‌ల్ లిఫ్ట్.. ఫేజ్-2 ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వండి
Advertisement

అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కొడంగల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేశారు. ఈ సమీక్షలో ప‌నుల పురోగ‌తిని ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివ‌రించారు. గత సమీక్ష సమావేశంలో సీఎం సూచనలను అనుగుణంగా పనుల్లో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళుతున్నామని అధికారులు తెలిపారు.

కొడంగ‌ల్ లిఫ్ట్ కు సంబంధించి ఫేజ్-2 పనులకు వీలయినంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతీ సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని రేవంత్ ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.

Advertisement
Advertisement