త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్‌

Gyanesh Kumar | ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)కు ప‌ద్మ‌భూష‌ణ్ (Padma Bhushan) ఇవ్వాల‌ని పశ్చిమ బెంగాల్ (West Bengal) బీజేపీ చీఫ్ (Bengal BJP chief) సమిక్ భట్టాచార్య (Samik Bhattacharya) డిమాండ్ చేశారు.

D

National | Published On Sep 26, 2026, 1.39 pm IST

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్‌
Advertisement

Gyanesh Kumar | త్రినేత్ర న్యూస్ : ఈసీలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయంటూ ఓ జాతీయ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి చెందిన ఓ నేత మాత్రం సీఈసీకి ప‌ద్మ‌భూష‌ణ్ (Padma Bhushan) ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికలను హింసకు తావులేకుండా నిర్వహించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ (Bengal BJP chief) సమిక్ భట్టాచార్య (Samik Bhattacharya) తెలిపారు. అంతేకాదు, సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారుల పేర్లను తొలగించడంలోనూ ఆయ‌న చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత బెంగాల్‌లో ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాలూ లేకుండా ప్ర‌శాంతంగా ఓటు వేశార‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితికి సీఈసీ కృషే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. అందుకు గానూ ఆయ‌న‌కు దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

"బెంగాల్ ప్రజలు ఎప్పుడూ ఇలాంటి ప్రశాంతమైన ఎన్నికలను చూడలేదు. ఇక్కడి ప్రజలు జ్ఞానేశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కనీసం ఆయనకు పద్మభూషణ్ పురస్కారమైనా ఇవ్వాల్సిందే" అని సమిక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. అదేవిధంగా స‌ర్‌, సీఈసీపై విపక్షాల ఆందోళనలను భ‌ట్టాచార్య తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఎన్నికలను రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ చేసిన దేశ‌ద్రోహులు వ్యాఖ్య‌ల‌ను స‌మిత్ తీవ్రంగా ఖండించారు.

ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం తెచ్చేందుకు కూడా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో సీఈసీకి బీజేపీ నేత‌ మద్దతుగా నిలవడం గమనార్హం. భట్టాచార్య వ్యాఖ్యల‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం క‌ల‌క‌లం.. 19 మంది మృతి

ప‌గ‌లు ప్ర‌పంచ శాంతి, రాత్రి ఉగ్ర‌వాదం.. ఇదీ దాయాది క‌ప‌ట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు స‌మాధానం

ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటే ఐల‌మ్మ స్ఫూర్తితో ఉద్య‌మించాలి

Advertisement
Advertisement