త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pocso Case | రప్పిస్తారా? తప్పిస్తారా?.. పోక్సో కేసులో రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ

Pocso Case | కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ (23) పై పోక్సో కేసు నమోదై ఆరు రోజులైనా దర్యాప్తులో ఏ కదలికా లేదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నా అతనెక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ బండి భగీరథ్ హైకోర్టు ను ఆశ్రయించాడు.

P

Telangana | Published On May 13, 2026, 7.01 pm IST

Pocso Case | రప్పిస్తారా? తప్పిస్తారా?.. పోక్సో కేసులో రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ
Advertisement
  • కేసు నమోదై 6 రోజులైనా ఆచూకీ లేని బండి తనయుడు
  • అసలు.. కదలికే లేని దర్యాప్తు
  • బుధవారం విచారణకు నిందితుడి డుమ్మా
  • ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో పిటిషన్
  • అమ్మాయి మేజర్ అంటూ ఆరోపణ
  • గురువారం నాడు విచారించనున్న న్యాయస్థానం
  • మైనరే.. అని నిర్ధారించిన పోలీసులు
  • పోక్సో సెక్షన్ 5(1), రెడ్ విత్ 6 చేర్పు
  • దోషిగా తేలితే 20 ఏళ్ల వరకు శిక్ష

Pocso Case | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ (23) పై పోక్సో కేసు నమోదై ఆరు రోజులైనా దర్యాప్తులో ఏ కదలికా లేదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నా అతనెక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ బండి భగీరథ్ హైకోర్టు ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిని విచారణకు రప్పిస్తారా లేక కేసు నుంచి తప్పిస్తారా.. అని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌లోపు విచార‌ణ‌కు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ప్ప‌టికీ, సాయి భ‌గీరథ్ విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. కాగా, విచార‌ణ‌కు 15వ తేదీన హాజ‌ర‌వుతాన‌ని భ‌గీర‌థ్ పోలీసుల‌కు స‌మాచారం అందించిన‌ట్లు స‌మాచారం.

ఆ అమ్మాయి మైన‌రే..

తనపై కుట్ర పూరితంగా పోక్సో కేసు పెట్టారని.. ఆ అమ్మాయి మేజర్ అని.. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ సాయి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం.. ఆ అమ్మాయి 2021లో 9వ తరగతి చదువుతుండ‌గా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన సందర్భంగా నమోదైన కేసు వివరాలను ఆధారాలుగా సమర్పించారు. 2021లో 15 ఏళ్ల వయసుంటే.. ఇప్పుడు 18 ఏళ్లు దాటి 20 ఏళ్ల వయసు ఉన్నందున ఆమె మేజరేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ పోక్సో కేసు విచారణలో.. పోలీసులు బాధితురాలిని రెండు సార్లు విచారించారు. ఆ అమ్మాయి మైనరేనని నిర్ధారించారు.

రెండు సర్టిఫికెట్లలోనూ.. మైనరే

బాధితురాలు తాను మైనర్‌నే అంటూ పోలీసులకు రెండు ఆధారాలు చూపించింది. జీహెచ్‌ఎంసీ జన్మదిన ధృవ పత్రం ప్రకారం బాధితురాలి పుట్టిన రోజు 2008 ఆగస్టు 12. అంటే ప్రస్తుతం ఆమె వయసు 17 సంవత్సరాల 8 నెలలు. ఆమె చూపిన మరో ఆధారం పాస్ పోర్టు. అందులో ఆమె పుట్టిన తేదీ 2010 ఆగస్టు 12 గా ఉంది. పాస్ పోర్టు ప్రకారం ఇప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాల 8 నెలలు. ఈ రెండింటిలో ఏ ఒక్క ఆధారాన్ని స్వీకరించినా లేదా రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నా బాధితురాలు మైనర్‌గా నిర్ధారణ అవుతుంది.

దోషిగా తేలితే.. 20 ఏళ్ల జైలు శిక్ష

ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ మంగళవారం స్వయంగా బాధితురాలితో మాట్లాడారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న భరోసా కేంద్రంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. తొలుత నమోదైన సెక్షన్ 11 రెడ్ విత్ 12 లకు అదనంగా సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 లను చేర్చారు. ఈ సెక్షన్ల ప్రకారం నిందితుడు దోషిగా తేలితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement