Pocso Case | పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు..
Pocso Case | మైనర్ బాలిక అత్యాచారం, బెదిరింపులకు సంబంధించిన పోక్సో కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి సహకరించిన ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ.4లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
- సహకరించిన మరో ఇద్దరికి మూడేళ్ల జైలు
- బాధితురాలికి రూ.4లక్షల పరిహారం
Pocso Case | మైనర్ బాలిక అత్యాచారం, బెదిరింపులకు సంబంధించిన పోక్సో కేసులో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి సహకరించిన ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ.4లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు 16 ఏళ్ల మైన బాలిక. కుటుంబ విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలి తల్లి పిల్లలతో కలిసి వేరుగా జీవిస్తోంది. జీవనోపాధి కోసం ఇళ్లలో పనులు చేస్తూ ఉండేది. పనికి వెళ్లే సమయంలో పిల్లలను కొత్తపేటలోని తన తల్లి ఇంట్లో ఉంచేది. ఈ క్రమంలో బాధితురాలిపై ఆమె మేనమామ అయిన మహమ్మద్ అజీమ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కొద్దిరోజులకు బాలిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లగా గర్భవతి అని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయమై బాధితురాలిని తల్లి నిందితులను నిలదీయగా.. మేనమామ లైంగిక దాడిని తల్లికి చెప్పింది. ఈ విషయంపై అజీమ్‌ను నిలదీయగా.. ఆమెను, బాలికను ప్రాణాలతో తీస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అజీమ్ (25)తో పాటు అతని సోదరుడు మహ్మద్ హలీమ్ (31), తల్లి జమీలా బేగం (60) బాలికకు గర్భస్రావం అయ్యేందుకు బలవంతంగా తినిపించారని పేర్కొన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం సమన్వయంతో పనిచేసి బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడంతో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు అజీమ్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.22వేల జరిమానా విధించింది.
నిందితుడి సోదరుడు హలీమ్, తల్లి జమీలా బేగంకు చెరో మూడేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో అప్పటి బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ బీ భాస్కర్, అప్పటి వనస్థలిపురం ఏసీపీ కే పురుషోత్తం రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే ప్రతాప్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ సత్యనారాయణ, భరోసా లీగల్ కౌన్సిలర్ ధృతి చౌదరి, ఇతర భరోసా బృంద సభ్యులు కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించారు. మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య ఎన్‌జేపీ పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ ఏసీపీ ప్రసన్న లక్ష్మి, భరోసా ఇన్‌స్పెక్టర్ పద్మ పల్లె, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జీ జ్యోతి తదితరులు కేసు పురోగతిని పర్యవేక్షించారు. బాధితురాలికి సకాలంలో న్యాయం జరిగేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్, భరోసా కేంద్రం సిబ్బందిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Human Trafficking Case | మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
సెప్టెంబర్ 18, 2026

Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!
సెప్టెంబర్ 18, 2026

Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
- ●Ramchandar Rao | మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్నో ప్రజలకు చెప్పాలి
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్ - నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?
- ●Kunamneni Sambashiva Rao | రాష్ట్రంలో తీవ్రంగా కరెంట్ సమస్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
- ●MLA Rakesh Reddy | 3 జిల్లాలకే అభివృద్ధి పరిమితమైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

MLA Manohar Reddy | మిషన్ భగీరథ నీళ్లే మాకు దిక్కు

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..

Ramchandar Rao | మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులెన్నో ప్రజలకు చెప్పాలి

Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్ - నాని, నితిన్ సినిమాలో రుక్మిణిగా?



