Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్
Bank of India Recruitment | ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్‌లో (GBO Stream) క్రెడిట్ ఆఫీసర్ (Credit Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Bank of India Recruitment) విడుదల చేసింది. మొత్తం 779 పోస్టులను భర్తీ చేస్తున్నది.
Bank of India Recruitment | త్రినేత్ర.న్యూస్: ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్‌లో (GBO Stream) క్రెడిట్ ఆఫీసర్ (Credit Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Bank of India Recruitment) విడుదల చేసింది. మొత్తం 779 పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హులైన అభ్యర్థులు www.bankofindia.bank.in వెబ్‌సైట్‌లో జూలై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఉద్యోగం సాధించినవారికి ప్రతినెల రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు జీతం వస్తుంది.
మొత్తం ఖాళీలు: 779
క్రెడిట్ ఆఫీసర్(ఎస్‌ఎంజీఎస్-II): 677 (ఎస్సీ102, ఎస్టీ 57, ఓబీసీ 180, ఈడబ్ల్యూఎస్ 69, జనరల్ 274)
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-III): 61 (ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 8, జనరల్ 22)
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-IV): 41 (ఎస్సీ 6, ఎస్టీ 2, ఓబీసీ 9, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ 21)
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సీఏ, సీఎంఏ-ఐసీడబ్ల్యూఏ/సీఎస్/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరి. 2026 జూన్ 1 నాటికి క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II పోస్టులకు 25 నుంచి 32, ఎంఎంజీఎస్-III కు 28 నుంచి 38, ఎస్‌ఎంజీఎస్-IV కు 32 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలి.
ఎంపిక విధానం: అప్లయ్ చేసిన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎంపిక ఆధారపడి ఉంటుంది. అంటే ఆన్‌లైన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ లేదా రెండు పద్ధతుల ద్వారా ఎంపిక ఉంటుంది. రెండూ నిర్వహిస్తే ముందుగా ఆన్‌లైన్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ లేకుంటే అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 125 మార్కుల ఉంటుంది. అందులో ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత) 100 ప్రశ్నలు 100 మార్కులు. 2 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి. ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20
వెబ్‌సైట్: www.bankofindia.bank.in
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!




