త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metro Rail | మెట్రో రైలులోకి ఎక్కిన మతిస్థిమితం లేని యువకుడు.. లోప‌ల ర‌చ్చ‌ర‌చ్చ‌

Metro Rail | మెట్రో రైలులోకి (Metro Rail) ఎక్కిన మ‌తిస్థిమితం లేని యువ‌కుడు.. కేక‌లు వేస్తూ, గట్టిగా ఏడుస్తూ , ప‌రుగులు పెడుతూ లోప‌ల ర‌చ్చ‌ర‌చ్చ చేశాడు. అత‌ని వింత ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

G

National | Published On Jan 22, 2026, 9.13 am IST

Metro Rail | మెట్రో రైలులోకి ఎక్కిన మతిస్థిమితం లేని యువకుడు.. లోప‌ల ర‌చ్చ‌ర‌చ్చ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మెట్రో రైలులోకి (Metro Rail) ఎక్కిన మ‌తిస్థిమితం లేని యువ‌కుడు.. కేక‌లు వేస్తూ, గట్టిగా ఏడుస్తూ , ప‌రుగులు పెడుతూ లోప‌ల ర‌చ్చ‌ర‌చ్చ చేశాడు. అత‌ని వింత ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘట‌న చెన్నై మెట్రోలో (Chennai Metro) చోటుచేసుకున్న‌ది.

చెన్నప‌ట్నంలోని కోయంబేడు మెట్రోస్టేష‌న్‌లోకి (Koyambedu Metro Station) వచ్చిన ఓ యువకుడు టిక్కెట్ తీసుకోకుండానే నేరుగా గేట్లువైపు వెళ్లాడు. తనకు టైం అవుతున్న‌దంటూ అక్కడి సిబ్బందిని నెట్టేసి రైలులోకి పరుగున ఎక్కేశాడు. దీంతో అప్రమత్తమైన మెట్రో సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు.

అయితే బోగీలోప‌ల నేల‌పై కూర్చున్న ఆ యువకుడు ‘నా జీవితం నాశనమైంది. క్షమించి వదిలేయండి’ అంటూ గట్టిగా ఏడుస్తూ అటూ ఇటూ పరుగులు పెట్టాడు. దీంతో అస‌లు ఏం జరుగుతుందో తెలియ‌క ప్రయాణికులు ఆందోళన చెందారు. అక్క‌డికి చేరుకున్న మెట్రో పోలీసులు యువకుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

అత‌డిని శ్రీపెరంబుదూర్‌కు చెందిన‌ వీరవేల్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యుల‌కు స‌మాచారం అందించ‌డంతో అక్కడికి చేరుకున్న‌రు. గ‌తంలో జ‌రిగిన ఓ ప్రమాదంలో అత‌ని తలకు గాయమైందని, దీంతో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు. అప్పుడప్పుడు ఇలా ఇంటి నుంచి బయటికొస్తాడని చెప్పారు. ఈ నేప‌థ్యంలో అత‌డిని హెచ్చ‌రించి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement