Metro Rail | ‘మద్యం’ సేవించి ‘మెట్రో’ ఎక్కితే.. రూ. 2500 ఫైన్ కట్టాల్సిందే..!
Metro Rail | మద్యం ప్రియులకు ఇది చేదు వార్త. కొంత మంది మద్యం ప్రియులు నిత్యం మద్యం సేవించి ఆర్టీసీ బస్సులు, సాధారణ రైళ్లతో పాటు మెట్రో రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. ఇతర ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తుంటారు.
Metro Rail | త్రినేత్ర.న్యూస్ : మద్యం ప్రియులకు ఇది చేదు వార్త. కొంత మంది మద్యం ప్రియులు నిత్యం మద్యం సేవించి ఆర్టీసీ బస్సులు, సాధారణ రైళ్లతో పాటు మెట్రో రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. ఇతర ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో జన విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు 2026 ద్వారా మెట్రో రైల్వే(ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం 2002కు సవరణలను ప్రతిపాదిస్తూ.. ఈ బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం ప్రవేశపెట్టారు. మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించినా, అభ్యంతకరమైన వస్తువులను తీసుకెళ్లినా, వాటిని ప్రదర్శించిన.. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా చేసే వారి పట్ల భారీ జరిమానాలను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ. 500 జరిమానాను రూ. 2500కు పెంతున్నట్లు తెలిపారు. రైలులో మద్యం సేవించి గొడవ చేయడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మివేయడం, రైల్లో ఫ్లోర్‌పై కూర్చోవడం, ఇతరులతో గొడవపడే వారికి ఈ జరిమానా వర్తిస్తుందన్నారు.
ఇక రైళ్లల్లో ప్రయాణికులు ఎవరైనా కంపార్ట్‌మెంట్‌లలో అసభ్యకరంగా రాసినా, వాల్ పోస్టర్లను అతికించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. అయితే ఈ జరిమానాను రూ. 10 వేలకు పెంచారు. ఇక మహిళా కోచ్‌ల్లోకి వెళే పురుష ప్రయాణికులకు ప్రస్తుతమున్న రూ. 250 జరిమానాను రూ. 5 వేలకు పెంచారు. మూడు నెలల జైలు శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kishan Reddy | మెట్రో రెండో దశకు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి
మే 20, 2026

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక..
మే 19, 2026

West Bengal | అభిషేక్ బెనర్జీకి ‘జెడ్ ప్లస్’ భద్రత వెనక్కి.. సువేందు ప్రభుత్వం కీలక నిర్ణయం..!
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



