త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uppal Metro Station | ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

Uppal Metro Station | ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన మెట్రో సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌కు చేరుకుని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

S

Hyderabad | Published On Apr 17, 2026, 3.40 pm IST

Uppal Metro Station | ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు
Advertisement

Uppal Metro Station | త్రినేత్ర‌.న్యూస్ : ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన మెట్రో సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌కు చేరుకుని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్, బాంబు స్క్వాడ్‌తో పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌క‌పోవ‌డంతో అటు మెట్రో సిబ్బంది, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌లో బాంబు పెట్టామ‌ని ఫోన్ చేసిన వ్య‌క్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే ఉప్ప‌ల్ మెట్రో స్టేష‌న్‌లో బాంబు పెట్టామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేయ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మెట్రో స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు. బాంబు, డాగ్ స్క్వాడ్ వ‌చ్చి త‌నిఖీలు చేసే వ‌ర‌కు సిబ్బంది, ప్ర‌యాణికులు ఆందోళన‌కు గుర‌య్యారు. బాంబు లేద‌ని తేల్చ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement