Hyderabad Metro Rail | మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణారావు
Hyderabad Metro Rail | హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి రానుంది.
Hyderabad Metro Rail | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి రానుంది. ఎల్ అండ్ టీ మెట్రోపై 100 శాతం ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. రూ.15,000 కోట్లతో హెచ్‌ఎంఆర్‌ఎల్ ద్వారా కొనుగోలు పూర్తయింది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణారావును, మరో 10 మంది సభ్యులతో కమిటీని నియమించింది.
హెఎంఆర్‌ఎల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. మెట్రో డైరెక్టర్లుగా జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, శివధర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జితేశ్ వి.పాటిల్ ఉండగా, హెచ్‌ఎంఆర్‌ఎల్ జాయింట్ ఎండీగా శివేంద్రప్రతాప్ నియామకమయ్యారు. షేర్ హోల్డర్లకు ఒక్కో షేర్ కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ షేర్ హోల్డింగ్ ఉంటుంది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు మిగిలిన షేర్లను కేటాయించారు.
ఏప్రిల్ నెలాఖరులోగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు ఎల్ అండ్ టీకి చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో నంబర్ 127ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెట్రోను టేకోవర్ చేసుకునేందుకు ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోదముద్ర వేసింది. గురువారం నాటి మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
టేకోవర్‌కు సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి లోన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్‌టేకింగ్ లేఖ, ప్రభుత్వ గ్యారంటీ, ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి డైరెక్ట్ డెబిట్ మాండేట్, రుణ టర్మ్‌షీట్, త్రైపాక్షిక ఒప్పందం, హెచ్‌ఎండీఏ నుంచి ఈక్విటీ నిధుల సమీకరణతోపాటు పలు అంశాలను అందులో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






