త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ragging | మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఐదుగురు సీనియ‌ర్ల‌పై వేటు

Ragging | మెడిక‌ల్ కాలేజీలో (Medical College) జూనియ‌ర్ల‌ను సీనియ‌ర్లు ర్యాగింగ్ (Ragging) చేశారు. వేధింపులు భ‌రించ‌లేక ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం (Suicide Attempt) చేశాడు. విష‌యం నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌కు చేర‌డంతో ర్యాగింగ్‌కు పాల్ప‌డిన వారిపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.

G

National | Published On Nov 29, 2026, 7.07 am IST

Ragging | మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్‌.. విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఐదుగురు సీనియ‌ర్ల‌పై వేటు
Advertisement

Ragging | త్రినేత్ర న్యూస్‌: మెడిక‌ల్ కాలేజీలో (Medical College) జూనియ‌ర్ల‌ను సీనియ‌ర్లు ర్యాగింగ్ (Ragging) చేశారు. వేధింపులు భ‌రించ‌లేక ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం (Suicide Attempt) చేశాడు. విష‌యం నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్‌కు చేర‌డంతో ర్యాగింగ్‌కు పాల్ప‌డిన వారిపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని వడోద‌ర‌లో జ‌రిగింది.

వ‌డోద‌ర‌లోని ఉన్న జీఎంఈఆర్ఎస్ (GMERS) మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్య‌వ‌హారం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హాస్టల్‌లో ప‌టాకులు కాల్చే విష‌యంలో వివాదం తలెత్తింది. దీంతో అర్ధ‌రాత్రి స‌మ‌యంలో సీనియర్ విద్యార్థులు ముగ్గురు జూనియర్ విద్యార్థులను దూషించ‌డంతోపాటు, తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు, తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక బాధిత జూనియర్ విద్యార్థుల్లో ఒకరు హాస్టల్ గది నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఉన్న మరో విద్యార్థి అతడిని రక్షించాడు. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)కి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ర్యాగింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను స‌స్పెండ్ చేసింది.

విచార‌ణ క‌మిటీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి (Medical Student) తన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించాడు. ఎనిమిదో అంతస్తులోని 814 నంబర్ గదికి తనను పిలిచారని, ఆ చిన్న గదిలో సుమారు ఎనిమిది మంది ఉండి తనను మానసికంగా వేధించారని తెలిపాడు. తనకు ఇప్పటికే 'ఇయర్ బ్యాక్' (Year back) ఉందని, ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేయడానికి ఉన్న నాలుగు అవకాశాలలో ఇప్పటికే ఒకటి పూర్తయిందంటూ అవ‌హేళ‌న చేశార‌ని పేర్కొన్నాడు. ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థితో సహా మొత్తం ఐదుగురు తనను వేధించారని అతడు ఆరోపించాడు. కాగా, పరీక్షలు, ప‌టాకులు కాల్చే (Firecrackers) విషయంలో తలెత్తిన వివాదంతో ఈ ఘటన జరిగిందని, ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ‌ని యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ హితేష్ రాథోడ్ చెప్పారు. ర్యాగింగ్ ఆరోపణల నేప‌థ్యంలో ఐదుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ (Rusticate) చేస్తున్నట్లు డీన్ డాక్టర్ పాండ్యా తెలిపారు. ఈ ఆరు నెలల పాటు నిందిత విద్యార్థులు హాస్టల్‌లోకి ప్రవేశించడానికి వీలులేదని, కాలేజీలో తరగతులకు హాజరై చదువు కొనసాగించవచ్చని తెలిపారు. అయితే కాలేజీ యాజ‌మాన్యం చ‌ర్య‌ల‌పై బాధిత విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement