Road Accident | కారును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Road Accident | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasam) జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
Andhra pradesh | Published On Nov 29, 2026, 6.32 am IST
Road Accident | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం (Prakasam) జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో 15 ఏండ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అద్దంకి మండలం చెరుకుంపాలేనికి చెందిన ఐదుగురు స్థానిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి కారులో వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు టంగుటూరు టోల్‌ప్లాజావద్దకు చేరుకుంది. అప్పటికే ప్లాజాలో వేచి ఉన్న ట్రావెల్స్ బస్సు వెనుక తమ వంతు కోసం ఆగింది. అయితే వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్య చిక్కుకోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది.
కారులో ప్రయాణిస్తున్న సోమేపల్లి సాయికుమార్, కోట కామేశ్వరమ్మ వీరితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న 15 ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న హైవే పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
నవంబర్ 28, 2026

Skip Toll | వాహనదారులూ జాగ్రత్త.. నంబర్ ప్లేట్ దాచి టోల్ ఎగ్గొట్టాలని చూస్తే 6 రెట్లు కట్టాల్సిందే!
నవంబర్ 28, 2026

Road Accident | దూసుకొచ్చిన మృత్యువు.. స్పాట్లోనే ఇద్దరు యువకుల మృతి.. ఈ ప్రమాదం జరిగిందిక్కడే
నవంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Ragging | మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లపై వేటు
- ●Horoscope | నవంబర్ 29 రాశి ఫలాలు.. మీ అన్వేషణా దృక్పథంతో మంచి ఫలితాలు పొందుతారు!
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం

Ragging | మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లపై వేటు

Horoscope | నవంబర్ 29 రాశి ఫలాలు.. మీ అన్వేషణా దృక్పథంతో మంచి ఫలితాలు పొందుతారు!

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల



