Medical Shops | రేపు మెడికల్ షాపులు బంద్..
Medical Shops | దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు (Medical Shops) బంద్ కానున్నాయి. హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ (AIOCD) సమ్మెకు పిలుపునిచ్చింది.
Medical Shops | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు (Medical Shops) బంద్ కానున్నాయి. హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ (AIOCD) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బుధవారం (మే 20న) మూతపడనున్నాయి. ఈ బంద్‌లో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (AIOCD) తెలిపింది. ఆన్‌లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నిలువరించాలని డిమాండ్ చేస్తున్నది.
కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలుగుతున్నదని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలకే మందులు అమ్ముతుండటంతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూడకుండానే ఔషధాలు విక్రయిస్తుండటంతో అవి మిస్‌యూజ్ అవుతున్నాయన్నారు. ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





