త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGS RTC | హైద‌రాబాద్ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఆర్టీసీ బ‌స్సుల్లో 30 శాతం రాయితీ

TGS RTC | మ‌రో వారం రోజుల వ‌ర‌కే ఇంధ‌న నిల్వ‌లు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. వాహ‌న‌దారులు పెట్రోల్, డీజిల్ కోసం (Petrol Diesel Shortage)పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరారు. గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసి త‌మ వాహ‌నాల్లో పెట్రోల్ పోయించుకుంటున్నారు.

G

Hyderabad | Published On Mar 26, 2026, 6.59 am IST

TGS RTC | హైద‌రాబాద్ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఆర్టీసీ బ‌స్సుల్లో 30 శాతం రాయితీ
Advertisement

TGS RTC | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రో వారం రోజుల వ‌ర‌కే ఇంధ‌న నిల్వ‌లు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. వాహ‌న‌దారులు పెట్రోల్, డీజిల్ కోసం (Petrol Diesel Shortage) పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరారు. గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసి త‌మ వాహ‌నాల్లో పెట్రోల్ పోయించుకుంటున్నారు.

ఈ వార్త‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌యాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) శుభ‌వార్త వినిపించింది. పెట్రోల్ కొర‌త నేప‌థ్యంలో మీ సొంత వాహ‌నాల‌ను వ‌దిలేసి ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించండి అని పిలుపునిచ్చింది. న‌గ‌ర ప‌రిధిలోని మెట్రో ఏసీ, డీల‌క్స్ బ‌స్సుల్లో 30 శాతం రాయితీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘పెట్రోల్‌ కష్టాలు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా’ అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement