త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Elections | బెంగాల్‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ.. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం..!

West Bengal Elections | బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. షెడ్యూల్ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల్లోనే సీఎస్‌, డీజీపీ స‌హా ప‌లువురు అధికారుల‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన విష‌యం తెలిసిందే.

P

National | Published On Mar 17, 2026, 4.33 pm IST

West Bengal Elections | బెంగాల్‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ.. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం..!
Advertisement

West Bengal Elections | బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. షెడ్యూల్ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల్లోనే సీఎస్‌, డీజీపీ స‌హా ప‌లువురు అధికారుల‌ను బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి 19 మంది ఐపీఎస్ అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది. ఇందులో ఉత్తర, దక్షిణ బెంగాల్ అదనపు డీజీ స్థాయి అధికారులు సైతం ఉన్నారు. ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ సింగ్‌ను దక్షిణ బెంగాల్ కొత్త ఏడీజీగా నియ‌మించ‌గా.. కే జయరామన్‌ను ఉత్తర బెంగాల్ ఏడీజీగా ఈసీ నియ‌మించింది. ఈ ఇద్దరూ 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులే. అలాగే, అసన్సోల్-దుర్గాపూర్, హౌరా, బరాక్‌పూర్, చందనగర్ ప్రాంతాల్లో కొత్త పోలీస్ కమిషనర్లను నియచ‌య‌డంతో పాటు అదనంగా 13 జిల్లాల ఎస్పీలను సైతం మార్చింది.

ఎస్పీల బ‌దిలీ వివ‌రాలు..

పుష్ప (IPS 2012) – ఎస్పీ, బరాస‌త్ పీడీ
జస్ప్రీత్ సింగ్ (IPS 2016) – ఎస్పీ, కూచ్ బెహార్
సూర్య ప్రతాప్ యాదవ్ (IPS 2011) – ఎస్పీ, బీర్భూమ్
రాకేష్ సింగ్ (SPS 2014) – ఎస్పీ, ఇస్లాంపూర్ పీడీ
కుమార్ సన్నీ రాజ్ (IPS 2017) – ఎస్పీ, హుగ్లి రూర‌ల్‌
ఇషానీ పాల్ (IPS 2013) – ఎస్పీ, డైమండ్ హార్బర్ పీడీ
సచిన్ (UPS 2013) – ఎస్పీ, ముర్షిదాబాద్ పీడీ
అలకనంద భౌవాల్ (IPS 2017) – ఎస్పీ, బసిర్హాట్ పీడీ
అనుపమ్ సింగ్ (IPS 2015) – ఎస్పీ, మాల్దా
అంగ్షుమన్ సహా (IPS 2012) – ఎస్పీ, పుర్బా మిడ్నాపూర్
యెల్వాద్ శ్రీకాంత్ జగన్నాథరావు (IPS 2015) – డీసీ, సెంట్రల్ డివిజన్, కోల్‌కతా
సురిందర్ సింగ్ (IPS 2016) – ఎస్పీ, జంగీపూర్
పాపియా సుల్తానా (SPS 2015) – ఎస్పీ, వెస్ట్ మిడ్నాపూర్

ఎన్నిక‌ల సంఘం ఆదివారం అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. షెడ్యూల్ వ‌చ్చిన కొద్ది గంట‌ల్లోనే బెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చ‌క్ర‌వ‌ర్తి, హోంశాఖ కార్య‌ద‌ర్శి జ‌గ‌దీశ్ ప్ర‌సాద్ మీన‌ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. నందిని చక్రవ‌ర్తి స్థానంలో 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుశ్మంత్ నరియాలాను కొత్త సీఎస్‌గా నియ‌మించింది. అలాగే, 1997 బ్యాచ్‌కు చెందిన సంగమిత్ర ఘోష్‌ను రాష్ట్ర హోం కార్యదర్శిగా నియ‌మించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వ‌చ్చింది. దీంతో పరిపాలనా అధికారులను బదిలీ చేయడానికి, నియమించడానికి ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంటుంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు జ‌రిగాయి. అయితే, సీఎస్ స్థాయిలో మార్పులు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. ఇక 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement