Mann Ki Baat | రంజీ చాంపియన్ జమ్మూ కశ్మీర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు..!
Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారి రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్ 132వ ఎపిసోడ్‌లో భారత క్రికెట్ జట్టు విజయాలను ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న జట్టుతో పాటు తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ జట్టును అభినందించారు.
Mann Ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారి రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్ 132వ ఎపిసోడ్‌లో భారత క్రికెట్ జట్టు విజయాలను ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న జట్టుతో పాటు తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ జట్టును అభినందించారు. ఇటీవల భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి వరల్డ్ కప్‌ని గెలిచిన విజయం తెలిసిందే. “జట్టు విజయం దేశం మొత్తానికి ఆనందాన్ని తీసుకొచ్చింది” అని ప్రధాని పేర్కొన్నారు. “ఈ నెల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఉత్సాహభరితంగా గడిచింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సమయంలో దేశమంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. న టీమిండియా విజయంతో అందరికీ గర్వంగా ఉంది” అన్నారు.
జమ్మూ కశ్మీర్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని ప్రస్తావించారు. “గత నెల చివరలో కర్నాటకలోని హుబ్లీ నగరంలో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ను గెలిచి జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలి టైటిల్ సాధించడం గొప్ప విషయం” అని పేర్కొన్నారు. జట్టు కెప్టెన్ పరాస్ డోగ్రా నాయకత్వాన్ని ప్రశంసించారు. అతని ప్రదర్శన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందన్నారు. అలాగే యువ బౌలర్ అకీబ్ నబీ రంజీ సీజన్‌లో 60 వికెట్లు తీసి దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువయ్యాడంటూ ప్రధాని కొనియాడారు. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో క్రీడలపై మరింత ఆసక్తిని పెంచుతుందని, యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గుల్మార్గ్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌తో జమ్మూ కశ్మీర్ క్రీడల్లో ఎదుగుతోందని పేర్కొన్నారు. యువ స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో ‘స్క్వాష్ ఆన్ ఫైర్’ పోటీలో విజయం సాధించి, కేవలం 17 ఏళ్ల వయసులోనే పీఎస్‌ఏ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో చోటు సంపాదించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అథ్లెట్ గుల్విర్ సింగ్ న్యూయార్క్ సిటీ హాఫ్ మారథాన్‌లో మూడో స్థానం సాధించి, గంటలోపు హాఫ్ మారథాన్ పూర్తి చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడని తెలిపారు. ‘అస్మిత అథ్లెటిక్స్ లీగ్’ గురించి సైతం ప్రస్తావించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు రెండు లక్షల మంది యువతులు పాల్గొన్నారని తెలిపారు. దేశంలో క్రీడల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






