త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Property Dispute | భార్య‌ను చంపి.. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి డ్ర‌మ్ములో దాచాడు

Property Dispute | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో (Firozabad) దారుణం జ‌రిగింది. ఆస్తి త‌గాదాతో (Property Dispute) సోద‌రుల‌తో క‌లిసి క‌ట్టుకున్న భార్య‌ను చంపిన వ్య‌క్తి.. త‌ల‌ను వేరుచేసి ఓ డ్ర‌మ్ములో దాచేశాడు. మొండెంను మంచంలో వ‌దిలేశారు.

G

National | Published On Jan 15, 2026, 1.10 pm IST

Property Dispute | భార్య‌ను చంపి.. మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి డ్ర‌మ్ములో దాచాడు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో (Firozabad) దారుణం జ‌రిగింది. ఆస్తి త‌గాదాతో (Property Dispute) సోద‌రుల‌తో క‌లిసి క‌ట్టుకున్న భార్య‌ను చంపిన వ్య‌క్తి.. త‌ల‌ను వేరుచేసి ఓ డ్ర‌మ్ములో దాచేశాడు. మొండెంను మంచంలో వ‌దిలేశారు.

ల‌తా దేవి, అషుతోశ్ భార్య‌భ‌ర్త‌లు. వారిద్ద‌రికి 26 ఏండ్ల క్రితం వివాహం జ‌రిగింది. అషుతోశ్ గ్రామంలో ప‌నిచేస్తుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. అత‌ని ముగ్గురు సోద‌రులు సిటీ నివ‌సిస్తున్నారు. కాగా, భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఆస్తికి సంబంధించి గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 12న రాత్రి సోద‌రుల‌తో క‌లిసి అషుతోశ్ త‌న భార్య‌ను ప‌దునైన ఆయుధంతో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అనంత‌రం ఆమె శ‌రీరం నుంచి త‌ల‌ను వేరుచేశారు. మొండెంను మంచంలో అలాగే వ‌దిలేసిన నిందితులు ఆమె త‌ల‌ను డ్ర‌మ్ములాంటి కంటైన‌ర్‌లో దాచిపెట్టారు.

స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెసెన్సిక్ బృందంతో క‌లిసి ఆధారాల‌ను సేక‌రించారు. నిందితులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అశుతోష్ అమాయ‌కుడ‌ని, అత‌ని త‌మ్ముళ్లే ఆయ‌న‌ను ఈ నేరంలోకి లాగార‌ని మృతురాలి తండ్రి, సోద‌రులు వెల్ల‌డించారు. వారికి 26 ఏండ్ల క్రితం వివాహ‌మైంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదం నేప‌థ్యంలో ఈ హ‌త్య జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement