లోడ్ అవుతోంది...


Sai Pallavi Bollywood Movie | సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్‌కు తెరపడింది. సంక్రాంతి కానుకగా ఈ హిందీ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అంతే కాకుండా ఫస్ట్ లుక్‌తో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
ఏక్ దిన్ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాతోనే దక్షిణాది టాప్ హీరోయిన్ సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏక్ దిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు.
ఏక్ దిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మంచు బాగా కురుస్తున్న ప్రదేశంలో హీరోహీరోయిన్లు జునైద్ ఖాన్, సాయిపల్లవి నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. వారిద్దరి చేతుల్లో ఐస్‌క్రీమ్స్ ఉన్నాయి. ఈ రొమాంటిక్ పోస్టర్‌పై ఉన్న వన్ లవ్...వన్ ఛాన్స్ క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.ఫస్ట్ లుక్‌తో పాటు ఏక్ దిన్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. మే 1న థియేటర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఏక్ దిన్ టీజర్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏక్ దిన్ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్‌లతో కలిసి ఆమిర్‌ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
2025లోనే సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తొలుత నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో డిసెంబర్‌కు వాయిదాపడింది. కానీ డిసెంబర్‌లో పెద్ద సినిమాలతో పోటీ కారణంగా మరోసారి పోస్ట్‌పోన్ అయ్యింది. దాంతో ఏక్ దిన్ కొత్త రిలీజ్ డేట్ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఒకానొక దశలో డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ బాలీవుడ్ మూవీ విడుదల కానున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పుకార్లకు సంక్రాంతి రోజున మేకర్స్ పుల్‌స్టాప్ పెట్టారు.
థాయ్‌లాండ్ మూవీ వన్‌డేకు రీమేక్‌గా ఎక్ దిన్ రూపొందుతోంది. టెంపరరీ మెమోరీ లాస్‌తో బాధపడుతున్న ప్రియురాలికి ఒక్క రోజులో తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఓ ప్రేమికుడు ఏం చేశాడు అనే కాన్సెప్ట్‌తో ఏక్ దిన్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఏక్ దిన్‌తో పాటు హిందీలో రామాయణ సినిమా కూడా చేస్తోంది సాయిపల్లవి. ఈ రెండు సినిమాలు 2026లోనే రిలీజ్ కాబోతున్నాయి. రామాయణంలో రణభీర్‌కపూర్ రాముడిగా కనిపిస్తుండగా...సాయిపల్లవి సీత పాత్రను పోషిస్తుంది. దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న రామాయణ మూవీకి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. . రామాయణ ఫస్ట్ పార్ట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్ కాబోతుంది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam