లోడ్ అవుతోంది...


Jana Nayagan | దళపతి విజయ్ జననాయగన్ సెన్సార్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. సుప్రీంకోర్టులోనూ ఈ సినిమాకు నిరాశే ఎదురైంది. జననాయగన్ సెన్సార్ వివాదంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాతల పిటీషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టులోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలను ఆదేశించింది. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని చెప్పింది. ఈ సెన్సార్ వివాదంపై ఈ నెల 20న విచారణ జరపాలని మద్రాస్ డివిజన్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సినిమాపై సరైన నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది.
హైకోర్టులో మొదలైన సమస్య మళ్లీ హైకోర్టుకే రావడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు విచారణతో ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోవడం ఖాయమని విజయ్ అభిమానులు భావించారు. కానీ కోర్టు తీర్పుతో నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు. జనవరి 20న మద్రాస్ హైకోర్టు ఈ సినిమాపై ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
అదే రోజు తీర్పు వస్తుందా...మళ్లీ విచారణ వాయిదాపడనుందా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒకవేళ విచారణ వాయిదాపడితే జనవరిలో జననాయగన్ రిలీజ్ కావడం కష్టమే అవుతుంది.
దళపతి విజయ్ హీరోగా జనగనాయగన్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలని నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భావించింది. పొలిటికల్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్‌తో పాటు హింసాత్మక సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
సెన్సార్ జాప్యంపై మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. జననాయగన్‌కు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పుపై సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించాలని, తమ వాదనకు అవకాశం ఇవ్వాలని కోరింది. డివిజన్ బెంచ్ స్టేతో ఈ సినిమా రిలీజ్ వాయిదాపడింది. డివిజన్ బెంచ్ స్టేను తొలగించాలంటూ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జననాయగన్ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam