Hyderabad | మాట్లాడుకుందామని పిలిచి.. యువతిని కొట్టి చంపేశాడు..
వారిద్దరికి పబ్‌లో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునేవారు. అయితే ఇటీవల అతడిని కొంచం దూరం పెట్టింది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు.. మాట్లాడుకుందామని పిలిచి ఆ యువతిని దారుణంగా హత్యచేశాడు.
త్రినేత్ర.న్యూస్: వారిద్దరికి పబ్‌లో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునేవారు. అయితే ఇటీవల అతడిని కొంచం దూరం పెట్టింది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు.. మాట్లాడుకుందామని పిలిచి ఆ యువతిని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) బోరబండలో చోటుచేసుకున్నది.
బోరబండకు చెందిన జహీర్.. ప్రస్తుతం జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పబ్‌లో పనిచేస్తున్న సమయంలో ఖనీజ్ ఫాతిమా అనే యువతితో పరియం ఏర్పడింది. ఇటీవల ఆమె మరో పబ్‌లో ఉద్యోగంలో చేరింది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్న జహీర్.. మాట్లాడుకుందామని పిలిచాడు. ఎర్రగట మెంటల్ హాస్పిటల్ వెనుక నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు.
తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న అతడు.. ఆ యువతిని చంపేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం పక్కనే ఉన్న ఉస్తీకి వెళ్లి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడికి దగ్గరగా ఉండటంతో పగ పెంచుకున్న నిందితుడు.. ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కడే ఈ హత్య చేశాడా లేదా దీనివెనుక మరెవరి పాత్ర అయినా ఉందా? అని ఆరాతీస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





