త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Airspace | గ‌గ‌న‌త‌లం మూసివేత‌కు ముందే.. ఇరాన్ మీదుగా ఢిల్లీ చేరిన ఇండిగో విమానం

Iran Airspace | దేశంలో నిర‌స‌న‌లు తీవ్ర‌రూపం దాల్చిన నేప‌థ్యంలో ఇరాన్ అక‌స్మాత్తుగా త‌న గ‌గ‌న‌త‌లాన్ని (Iran Airspace) మూసివేసింది. వాణిజ్య విమానాలు త‌మ దేశం మీదుగా వెళ్ల‌డానికి వీల్లేదంటూ ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశం మీదుగా ప్ర‌యాణించిన చివ‌రి నాన్ ఇరానియ‌న్ విమానంగా ఇండిగో (IndiGo) నిలిచింది.

G

National | Published On Jan 15, 2026, 12.34 pm IST

Iran Airspace | గ‌గ‌న‌త‌లం మూసివేత‌కు ముందే.. ఇరాన్ మీదుగా ఢిల్లీ చేరిన ఇండిగో విమానం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో నిర‌స‌న‌లు తీవ్ర‌రూపం దాల్చిన నేప‌థ్యంలో ఇరాన్ అక‌స్మాత్తుగా త‌న గ‌గ‌న‌త‌లాన్ని (Iran Airspace) మూసివేసింది. వాణిజ్య విమానాలు త‌మ దేశం మీదుగా వెళ్ల‌డానికి వీల్లేదంటూ ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ దేశం మీదుగా ప్ర‌యాణించిన చివ‌రి నాన్ ఇరానియ‌న్ విమానంగా ఇండిగో (IndiGo) నిలిచింది.

ఇండిగోకు చెందిన 6ఈ1808 విమానం జార్జియాలోని టిబిలిసి నుంచి ఢిల్లీకి బుధ‌వారం ఉద‌యం 11.29 గంట‌ల‌కు బ‌య‌ల్దేరింది. గురువారం ఉద‌యం 7.03 గంట‌ల‌కు ఢిల్లీకి చేరింది. ఇరాన్ మీదుగా వ‌చ్చిన ఆ విమానం గురువారం తెల్ల‌వారుజామున 2.35 గంట‌ల‌కు స‌మ‌యంలో ఆ దేశ గ‌గ‌న‌త‌లాన్ని దాటేసింది. దీంతో ఇరాన్ ఎయిర్ స్పేస్ మీదుగా ప్ర‌యాణించిన చివ‌రి అంత‌ర్జాతీయ విమానంగా నిలించింది. ఈ మేర‌కు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్‌రాడార్ 24 వెల్ల‌డించింది.

ఇరాన్‌లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లు త‌మ ప్ర‌యాణికుల‌కు అడ్వైజ‌రీ జారీచేశాయి. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని వెళ్ల‌డించాయి.

సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా గ‌త రెండు వారాలుగా ఆ దేశంలో నిర‌స‌నలు కొన‌సాగుతున్నాయి. ప‌లుచోట్ల అవి హింసాత్మ‌కంగా మారాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 2400 మందికిపైగా మ‌ర‌ణించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement