త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Advisory | హైద‌రాబాద్‌లో హ‌నుమాన్ శోభాయాత్ర.. వాహ‌న‌దారులు ఈ మార్గాల్లో వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది..!

Traffic Advisory | హ‌నుమాన్ జ‌యంతి (Hanuman Jayanthi) సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో (Hyderabad) పెద్దఎత్తున శోభాయాత్ర (Hanuman Shobha Yatra) నిర్వహించ‌నున్నారు. పాత‌బ‌స్తీలోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్‌లోని హ‌నుమాన్ ఆల‌యం వ‌ర‌కు యాత్ర సాగ‌నుంది.

G

Telangana | Published On Apr 2, 2026, 6.22 am IST

Traffic Advisory | హైద‌రాబాద్‌లో హ‌నుమాన్ శోభాయాత్ర.. వాహ‌న‌దారులు ఈ మార్గాల్లో వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది..!
Advertisement

Traffic Advisory | త్రినేత్ర‌.న్యూస్‌: హ‌నుమాన్ జ‌యంతి (Hanuman Jayanthi) సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో (Hyderabad) పెద్దఎత్తున శోభాయాత్ర (Hanuman Shobha Yatra) నిర్వహించ‌నున్నారు. పాత‌బ‌స్తీలోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్‌లోని హ‌నుమాన్ ఆల‌యం వ‌ర‌కు యాత్ర సాగ‌నుంది. న‌గ‌రంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ గుడి, ఇతర ఆలయాల నుంచి ఉపయాత్రలు సాగనున్నాయి. పలు ప్రాంతాల నుంచి జరిగే 14 ఉపయాత్రలు ప్రధానయాత్రలో విలీనమ‌వుతాయి. 39 ప్రధాన ప్రాంతాల మీదుగా శోభాయాత్ర జరుగనుంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Advisory) విధించారు. గురువారం ఉద‌యం 8 నుంచి రాత్రి 9 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో దారిమ‌ళ్లింపులు ఉటాయ‌ని చెప్పారు. ప్ర‌యాణికులు దానికి అనుగుణంగా త‌మ ప్ర‌యాణాల‌ను ప్లాన్ చేసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌ధాన మార్గాలైన కోటి, అబిడ్స్‌, నారాయ‌ణ‌గూడ‌, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌, ముషీరాబాద్‌, సికింద‌రాబాద్ మార్గాల్లో శోభాయాత్ర ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపారు. అందువ‌ల్ల వాహ‌న‌దారులు ఎల్బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్‌, తార్నాక‌, సికింద్రాబాద్‌, మెహిదీప‌ట్నం మార్గాల్లో ప్ర‌త్యామ్నాయాల‌ను చూసుకోవాల‌న్నారు.

పెద్ద సంఖ్య‌లో యువ‌త‌, భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఉండ‌టంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా శోభాయాత్రలో దాదాపు 4 వందల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా సహాయం కోసం 9010203626 నంబర్ ద్వారా ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది.

 

 

Advertisement
Advertisement