త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | ఓటరు లిస్టులో మీ పేరు తీసేస్తే.. మీ కిచెన్‌లోని గరిటెలకు పని చెప్పండి

తాజాగా కృష్ నగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఓటర్ లిస్టులో మీ పేరు తీసేస్తే ఊరుకుంటారా? మీ ఇంట్లో కిచెన్ ఉంది కదా? ఆ కిచెన్‌లో గరిటెలు ఉన్నాయి కదా? వాటికి పని చెప్పండి. మహిళలు ఎప్పుడూ ముందుండే పోరాడుతారు. మగవాళ్లే వాళ్ల వెనుక ఉంటారు.. అంటూ మమతా బెనర్జీ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.

J

National | Published On Dec 11, 2025, 3.47 pm IST

Mamata Banerjee | ఓటరు లిస్టులో మీ పేరు తీసేస్తే.. మీ కిచెన్‌లోని గరిటెలకు పని చెప్పండి
Advertisement

Mamata Banerjee | పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఓటర్ల లిస్టు సవరణ జరుగుతోంది. దానికి కారణం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన చాలామంది అక్కడే అక్రమంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు పొంది ఓటు హక్కు సంపాదించుకొని ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. అక్రమంగా దేశం దాటి రావడం, ఇక్కడి పౌరసత్వాన్ని అక్రమంగా పొంది ఇక్కడే సెటిల్ అవుతున్నారని చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ను తీసుకొచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో చేపడుతున్న ఈ స్పెషల్ డ్రైవ్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఆ డ్రైవ్‌ను ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి ఎవ్వరూ ఇక్కడ బతకడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లంతా స్థానికులే. మీ ప్లాన్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజల ఓట్లను లిస్టులో లేకుండా తీసేస్తారా? అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా కృష్ నగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఓటర్ లిస్టులో మీ పేరు తీసేస్తే ఊరుకుంటారా? మీ ఇంట్లో కిచెన్ ఉంది కదా? ఆ కిచెన్‌లో గరిటెలు ఉన్నాయి కదా? వాటికి పని చెప్పండి. మహిళలు ఎప్పుడూ ముందుండే పోరాడుతారు. మగవాళ్లే వాళ్ల వెనుక ఉంటారు.. అంటూ మమతా బెనర్జీ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.

మహిళలా లేక బీజేపీనా?

ఎవరు శక్తివంతులో నాకు చూడాలని ఉంది. మహిళలా లేక బీజేపీనా? అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కమ్యూనలిజమ్ అంటే ఏంటో నాకు తెలియదు. నేను సెక్యూలరిజాన్ని మాత్రమే నమ్ముతాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ డబ్బులు ఉపయోగించి వేరే రాష్ట్రాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడి స్థానికులను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది అంటూ బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement