త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ‘స‌ర్’ పై అప్ర‌మ‌త్తంగా ఉందాం: నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు, ప‌రిశీల‌కుల‌తో పొన్నం

Ponnam Prabhakar | కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ పరిధిలో సర్ (SIR) ప్రక్రియపై నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ప‌రిశీల‌కులు ఎల్ల‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్య నాయ‌కుల‌తో క‌లిసి చ‌ర్చించారు.

S

News | Published On May 16, 2026, 4.36 pm IST

Ponnam Prabhakar | ‘స‌ర్’ పై అప్ర‌మ‌త్తంగా ఉందాం: నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు, ప‌రిశీల‌కుల‌తో పొన్నం
Advertisement
  • ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తాం
  • మండ‌లాల వారీగా పార్టీ స‌మావేశాలు నిర్వ‌హించండి
  • క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు మంత్రి పొన్నం సూచ‌న‌ 

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్: కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ పరిధిలో సర్ (SIR) ప్రక్రియపై నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ప‌రిశీల‌కులు ఎల్ల‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జిలు, అబ్జర్వర్ల తో శ‌నివారం ఆయ‌న‌ కీలక సమావేశం నిర్వ‌హించారు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, చేప‌ట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్య నాయ‌కుల‌తో క‌లిసి చ‌ర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని చెప్పారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో డీసీసీ అధ్యక్షులు మండలాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. SIR (ఓటరు జాబితా సవరణ)పై నియోజకవర్గ ఇంచార్జిలు, కోఆర్డినేటర్ లు అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గాల వారీగా వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా పార్టీ నేతలు క్రియాశీలకంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలి. పార్టీలో ముందు నుండి క్రియాశీలంగా ఉన్న వారికి గుర్తింపు ద‌క్కుతుంది. నామినేటెడ్ పార్టీ పదవుల్లో పార్టీ నిర్ణయించిన విధంగా మూడు సంవత్సరాలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం అని పొన్నం పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కేకే మహేందర్ రెడ్డి, ఒడితల ప్రణవ్, నియోజకవర్గ కోఆర్డినేటర్స్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వెంకట రమణ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, ఆదేం రాజ్ దేఖపతి, సౌజన్య గౌడ్ పాల్గొన్నారు.

బీఎల్ఏల నియామ‌కం పూర్తి చేయండి: మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌

అంత‌కుముందు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో కరీంనగర్ పార్లమెంట్ ముఖ్య నేతలతో కలిసి జూమ్ సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ SIR ఓటరు జాబితా సవరణపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో SIR పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనీ అన్ని గ్రామాల్లో బీఎల్ఏల నియామకం పూర్తి చేయాలని మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల నియామకం చేసి మండల కమిటీ లు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement
Advertisement