CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రామప్ప, వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రామప్ప, వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సం అనంతరం ఆ జిల్లా ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర మొదలుపెట్టాలి. ప్రజల సమ్యలు తెలుసుకోవాలి. ప్రజలకు భరోసా, విశ్వాసం కల్పించాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. గిరిజనులకు, ఆదివాసీలకు మేలు జరుగుతుందని పాదయాత్ర మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఆదిలాబాద్, భద్రాచలం, అలంపూర్, అచ్చంపేట నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని సూచన చేశారు. కానీ మేం అందరం నిర్ణయించుకుని మన ఇంటి ఆడపడుచు సీతక్క నియోజకవర్గం నుంచి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర ప్రారంభిస్తే తిరుగుండదు.. తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని కొందరు సూచించారు. దాంతో ఇక్కడ్నుంచే పాదయాత్ర మొదలుపెట్టాను. అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. ప్రతి గూడెంకు, గుండెకు చేరినం. ప్రతి పేదవాడిని కలిసి సమస్యలు తెలుసుకున్నాం. సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించాం. భరోసాతో నాలుగుకోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలనను ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సీతక్క మీ సమస్యలు పరిష్కరించే నాయకురాలిగా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతుంది. ఆనాటి ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని నిర్లక్ష్యం చేసింది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా వనదేవతలను పూజించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం.. చేసి చూపించాం. సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు కృషి చేసి.. అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. రామప్ప, వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారంను అభివృద్ధి చేశామని సీఎం తెలిపారు.
ఈ కలెక్టరేట్ పక్కనే ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాలను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. త్వరలోనే వాటి నిర్మాణాలను కూడా చేపడుతాం. మల్లూరి నరసింహ స్వామి దేవాలయానికి నిధులు మంజూరు చేస్తా. జంపన్న వాగును అభివృద్ధి చేసి, ఘాట్లు ఏర్పాటు చేస్తాం. ఆదివాసీ బిడ్డలు కష్టాలకు మారుపేరు. మీ కష్టాలను తీర్చాలంటే సాగునీరు అందించాలి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావాల్సిన నిధులతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | మేడారంలో సీఎం రేవంత్ మొక్కులు.. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ
ఆగస్టు 16, 2026

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?
ఆగస్టు 16, 2026

TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | మేడారంలో సీఎం రేవంత్ మొక్కులు.. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ
- ●Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ - మలయాళ బ్యూటీతో రొమాన్స్
- ●Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?
- ●TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం
- ●Bandla Ganesh Daughter Wedding | బండ్ల గణేష్ ఇంట అంబరాన్నంటిన పెళ్లి సందడి: వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్
- ●Srinidhi Shetty | నాలుగేళ్ల తర్వాత మాతృభాషలో సినిమా - ఖాకీ డ్రెస్‌లో కేజీఎఫ్ హీరోయిన్

Revanth Reddy | మేడారంలో సీఎం రేవంత్ మొక్కులు.. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ

Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ - మలయాళ బ్యూటీతో రొమాన్స్

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?

TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం



