త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ananya Raj | 27 ఏళ్లకే హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూత – నిద్రలోనే మృత్యుఒడికి

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన అన‌న్య రాజ్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసింది. గ‌త ఏడాది కాలంగా ఆమె మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న అన‌న్య రాజ్ ఆగ‌స్ట్ 15న తెల్ల‌వారుజామున నిద్ర‌లోనే తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంస‌భ్యులు ప్ర‌క‌టించారు. తెలుగులో త‌గ్గేదేలేతో పాటు మ‌ద్రాసి గ్యాంగ్ సినిమాలు చేసింది అన‌న్య రాజ్‌.

N

Entertainment | Published On Aug 16, 2026, 4.47 pm IST

Ananya Raj | 27 ఏళ్లకే హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూత – నిద్రలోనే మృత్యుఒడికి
Advertisement

Ananya Raj | సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసిన యంగ్ హీరోయిన్ అన‌న్య‌ రాజ్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందింది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమె మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు ప్ర‌క‌టించారు. అన‌న్య రాజ్ మ‌ర‌ణ‌వార్త‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. గ‌త ఏడాది కాలంగా అన‌న్య రాజ్ తీవ్ర‌మైన శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ధైర్యంగా పోరాడింది. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి జూలై 15న తెల్ల‌వారుజామున నిద్ర‌లోనే క‌న్నుమూసింది అంటూ కుటుంబ‌స‌భ్యులు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. 27 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే అన‌న్య రాజ్ మ‌ర‌ణించ‌డం అభిమానుల‌ను క‌లిచివేస్తోంది.

బాలీవుడ్ సినిమాల‌తో...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో జ‌న్మించిన అన‌న్య రాజ్ రాజ్ అస‌లు అన‌న్య సేన్ గుప్తా. మోడ‌లింగ్‌, షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన అన‌న్య రాజ్ 7 అవ‌ర్స్ టూ గో సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఘోస్ట్‌, ఫైన‌ల్ ఎగ్జిట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. హిందీలో పాయిజ‌న్‌, ది డెవిల్ ఇన్‌సైడ్‌తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించింది.

త‌గ్గేదేలే తో టాలీవుడ్ ఎంట్రీ...

న‌వీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌గ్గేదేలే మూవీతో అన‌న్య రాజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో లిజి అనే మోడ్ర‌న్ అమ్మాయిగా గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించింది. త‌గ్గేదేలే త‌ర్వాత మ‌ద్రాసి గ్యాంగ్ పేరుతో మ‌రో ద్విభాషా సినిమా చేసింది. అజయ్ ఆండ్రూస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మురికివాడ‌కు చెందిన యువ‌తిగా క‌నిపించింది.

Advertisement
Advertisement