Revanth Reddy | మేడారంలో సీఎం రేవంత్ మొక్కులు.. అడవి తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ
Revanth Reddy | ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క, సారక్క దేవతలను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. గద్దెల వద్ద మొక్కలు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క, సారక్క దేవతలను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. గద్దెల వద్ద మొక్కలు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. సీఎం రాకను పురస్కరించుకొని పూజారులు గిరిజన సంస్కృతి, సంప్రదాయాల మధ్య డోలు వాయిద్యాలతో ముఖ్యమంత్రిని ఆలయ ప్రాంగణంలోకి ఆహ్వానించారు. వన దేవతల సమక్షంలో సీఎం రేవంత్‌కు, మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు.
ఒంటరి మహిళలు, వితంతువుల కోసం ఉద్దేశించిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మేడారం వేదికగా సీఎం రేవంత్ ప్రారంభించారు. ఒంటరి మహిళలకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేసిన సీఎం, పలువురికి కొత్త పింఛన్ మంజూరు పత్రాలు అందించారు. అనంతరం మేడారం ప్రాంగణంలో మొక్కలు నాటిన రేవంత్ రెడ్డి మహిళలతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు బిచ్కుంద నుంచి మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ సీఎం రేవంత్‌కు స్వాగతం పలికారు.
సంబంధిత వార్తలు

TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్
ఆగస్టు 16, 2026

CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 16, 2026

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. రేపే సీఎం చేతుల మీదుగా టిమ్స్ ప్రారంభోత్సవం
- ●CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ananya Raj | 27 ఏళ్లకే హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూత - నిద్రలోనే మృత్యుఒడికి
- ●Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ - మలయాళ బ్యూటీతో రొమాన్స్
- ●Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?
- ●TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం

TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. రేపే సీఎం చేతుల మీదుగా టిమ్స్ ప్రారంభోత్సవం

CM Revanth Reddy | వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Ananya Raj | 27 ఏళ్లకే హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూత - నిద్రలోనే మృత్యుఒడికి

Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ - మలయాళ బ్యూటీతో రొమాన్స్



