Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ – మలయాళ బ్యూటీతో రొమాన్స్
ధురంధర్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో సినిమా చేసేందుకు పలువురు అగ్ర దర్శకులు సిద్ధమయ్యారు. కానీ రణ్‌వీర్‌సింగ్ మాత్రం ఓ వెబ్‌సిరీస్ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. స్కామ్ 1992 ఫేమ్ జై మెహతాతో జాంబీ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఆదివారం ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
Entertainment | Published On Aug 16, 2026, 4.01 pm IST
Bollywood | రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ధురంధర్ 2 మూవీ బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సెకండ్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో హమ్జా అలీ పాత్రలో రణ్‌వీర్ తన నటనతో బాలీవుడ్ ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించాడు.
స్కామ్ 1992 ఫేమ్...
ధురంధర్ రెండు పార్ట్‌లు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో రణ్‌వీర్‌సింగ్ కోసం పలువురు అగ్ర దర్శకులు కథలు సిద్ధం చేశారు. కానీ రణ్‌వీర్ సింగ్ మాత్రం వారిని కాదని వెబ్‌సిరీస్ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. స్కామ్ 1992, లూటేరే వెబ్‌సిరీస్‌లతో ఫేమస్ అయిన జై మెహతా దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్ ప్రళయ్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. జాంబీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అనన్యా బిర్లాతో కలిసి రణ్‌వీర్‌సింగ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రళయ్‌తోనే ఈ బాలీవుడ్ హీరో ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారు. ఇందులో అనన్యా బిర్లా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
మలయాళ బ్యూటీ...
ప్రళయ్ మూవీతో మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆదివారం సెలైంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. తొలిరోజే రణ్‌వీర్‌సింగ్, కళ్యాణి ప్రియదర్శన్‌తో పాటు అనన్యా బిర్లా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం.
ముంబైలో జాంబీలు...
జాంబీ బ్యాక్‌డ్రాప్‌లో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రమాదకర వైరస్ కారణంగా ముంబైలోని ప్రజలంతా జాంబీలుగా మారుతారు. ఓ వివాహిత, ప్రేమ జంటతో పాటు మరో యువకుడు జాంబీ వైరస్ బారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేశారు? జాంబీ వైరస్ నుంచి ముంబై నగరాన్ని ఎలా కాపాడరనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ప్రళయ్ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జువాన్ కార్లోస్ గిల్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ఆస్ట్రేలియాలో తెరకెక్కించాలని అనుకున్నారు. రణ్‌వీర్‌సింగ్ భార్య దీపికా పడుకోన్ ప్రెగ్నెంట్ కావడంతో ముంబైలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Tamannaah | హారర్ మూవీ షూటింగ్‌లో భయపడ్డ మిల్కీ బ్యూటీ – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఆగస్టు 8, 2026

Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ – ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?
- ●TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం
- ●Bandla Ganesh Daughter Wedding | బండ్ల గణేష్ ఇంట అంబరాన్నంటిన పెళ్లి సందడి: వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్
- ●Srinidhi Shetty | నాలుగేళ్ల తర్వాత మాతృభాషలో సినిమా - ఖాకీ డ్రెస్‌లో కేజీఎఫ్ హీరోయిన్
- ●Sunitha Lakshma Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోతే నిధులివ్వడట.. సంగారెడ్డిలో సీఎం చెప్పకనే చెప్పిండు
- ●Mulugu Sand Mafia | ములుగులో తల్లి ఇసుక దందా.. కొడుకు బెట్టింగ్ మాఫియా

Kranthi Kiran | రేవంత్.. నువ్ సీఎంవా.. మంత్రగానివా? కరువును వొదిలేసి క్షుద్రపూజల లొల్లేంది?

TIMS | రేపు సాయంత్రం 4.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభం

Bandla Ganesh Daughter Wedding | బండ్ల గణేష్ ఇంట అంబరాన్నంటిన పెళ్లి సందడి: వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్

Srinidhi Shetty | నాలుగేళ్ల తర్వాత మాతృభాషలో సినిమా - ఖాకీ డ్రెస్‌లో కేజీఎఫ్ హీరోయిన్



