Bureaucratic Shuffle | డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా వీర్ విక్రమ్ యాదవ్.. డీవోపీటీకి ఫైజ్ అహ్మద్..!
Bureaucratic Shuffle | కేంద్రం పలువురు బ్యూరోక్రాట్స్ శాఖలను మార్పులు చేసింది. వీర్ విక్రమ్ యాదవ్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో బాధ్యతలు అప్పగించింది.
Bureaucratic Shuffle | కేంద్రం పలువురు బ్యూరోక్రాట్స్ శాఖలను మార్పులు చేసింది. వీర్ విక్రమ్ యాదవ్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో బాధ్యతలు అప్పగించింది. ఆయన ప్రస్తుతం పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. విస్తరిస్తున్న విమానయానరంగం, ప్రయాణీకుల రద్దీ, సంస్థల విమానాల సంఖ్య పెరగడం, భద్రతపై దృష్టి, పటిష్టమైన నియంత్రణ పర్యవేక్షణలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కిద్వాయ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కి అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన జనవరి 2025లో డీజీసీఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదికిపైగా ఆ పదవిలో కొనసాగారు. అలాగే, కేంద్రం పలు శాఖల ఉన్నత స్థాయి అధికారుల శాఖల్లోనూ మార్పులు చేసింది.
పునీత్ కన్సల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించగా, మోనా కే ఖండార్‌ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించారు. జ్ఞానేంద్ర డీ త్రిపాఠి వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు భారత వ్యవసాయ పరిశోధన మండలికి కార్యదర్శిగానూ కొనసాగనున్నారు. విశాల్ గగన్‌ను అదనపు కార్యదర్శి హోదాలో కేంద్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా నియమించింది. ఎన్ గుల్జార్ గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రాజధాని ప్రాంత ప్రణాళికా బోర్డుకు సభ్య కార్యదర్శిగా పనిచేయనున్నారు. దివాకర్ నాథ్ మిశ్రాను విద్యుత్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించగా, దేబాషిష్ ప్రుష్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. శ్రీధర్ చిరుతోలు సైతం ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉద్యోగోన్నతి పొందారు.
తాజావార్తలు
- ●Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ పోలీసుల సమన్లు
- ●PM Modi | మోదీని కలిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్.. భారత్–కెనడా బంధం బలోపేతానికి చర్చలు
- ●Kayadu Lohar | ‘డ్రాగన్’తో క్రేజ్.. ‘ది ప్యారడైజ్’తో నిరాశ.. తెలుగులో కయదుకు దక్కని బ్రేక్!
- ●Karthik Subbaraj | రజినీతో మిస్సయిన మ్యాజిక్.. చిరుతో చూపిస్తాడా..?
- ●Mahesh Kumar Goud | దసరా తర్వాత 2 లక్షల మందితో మార్చ్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ సరికొత్త ప్రయాణం..! ఈ రంగంలోనైనా సక్సెస్ అవుతుందా?

Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ పోలీసుల సమన్లు

PM Modi | మోదీని కలిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్.. భారత్–కెనడా బంధం బలోపేతానికి చర్చలు

Kayadu Lohar | ‘డ్రాగన్’తో క్రేజ్.. ‘ది ప్యారడైజ్’తో నిరాశ.. తెలుగులో కయదుకు దక్కని బ్రేక్!

Karthik Subbaraj | రజినీతో మిస్సయిన మ్యాజిక్.. చిరుతో చూపిస్తాడా..?



