Air India | రన్‌వే పైకి వచ్చి గాల్లోకి దూసుకెళ్లిన విమానం.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..!
Air India | ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-1719 విమానం బయలుదేరి వెళ్లింది. అయితే, విమానం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం 1.05 గంటల ప్రాంతంలో ల్యాండ్ చేసేందుకు పైలెట్ ప్రయత్నించాడు.
Air India | ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-1719 విమానం బయలుదేరి వెళ్లింది. అయితే, విమానం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం 1.05 గంటల ప్రాంతంలో ల్యాండ్ చేసేందుకు పైలెట్ ప్రయత్నించాడు. రన్ వేని తాకే సమయంలో పైలట్ తన మనసు మార్చుకొని విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్తారు. దాంతో విమానంలో ఉన్న ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు.. ల్యాండింగ్ సమయంలో అస్థిరంగా అనిపించడంతో.. ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన పైలట్ విమానాన్ని స్టాండర్డ్ ప్రొసీడింగ్స్ ప్రకారం వెంటనే గో అరౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆ తర్వాత విమానం కొద్దిసేపు ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల చక్కర్లు కొట్టింది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న పది నిమిషాల తర్వాత రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దాంతో విమానంలోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి సుఖ్‌జిందర్ రంధావా ఈ విమానంలోనే ఉన్నారు. సంఘటన సమయంలో ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, ఏ దశలోనైనా ల్యాండింగ్ సురక్షితం కాదని భావిస్తే.. విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకువెళ్లొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉదయం విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో మారామతి విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లయిట్ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో పవార్ భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు పైలట్లు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల కోసం బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన బారామతికి బయలుదేరారు. ఆయన ఉదయం 8.10 గంటలకు ముంబయి నుంచి బయలుదేరారు. మహారాష్ట్ర విమానయాన శాఖ ప్రకారం.. పైలట్ ఉదయం 8.45 గంటలకు బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించాడు. కానీ, రన్ వే స్పష్టంగా కనిపించకపోవడంతో విమానాన్ని మళ్లీ ఎత్తుకు తీసుకువెళ్లాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






