త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pankaja Munde | హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. మ‌హారాష్ట్ర‌లో మంత్రికి త‌ప్పిన ప్ర‌మాదం

Pankaja Munde | మ‌హారాష్ట్ర మంత్రి (Maharashtra Minister) పంక‌జ ముండే (Pankaja Munde)కి పెను ప్ర‌మాదం త‌ప్పింది.

D

National | Published On Feb 3, 2026, 1.58 pm IST

Pankaja Munde | హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. మ‌హారాష్ట్ర‌లో మంత్రికి త‌ప్పిన ప్ర‌మాదం
Advertisement

Pankaja Munde | మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఇటీవ‌లే విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతితో మ‌హా రాజ‌కీయాల్లో లోటు ఏర్ప‌డింది. అయితే, ఇప్పుడు తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి (Maharashtra Minister) పెను ప్ర‌మాదం త‌ప్పింది.

బీజేపీ నాయ‌కురాలు, మంత్రి పంక‌జ ముండే (Pankaja Munde) ఇవాళ రాష్ట్రంలోని లాతూర్ (Latur)కు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్లాల్సి ఉంది. మ‌రికాసేప‌ట్లో సంభాజీనగర్ (Sambhajinagar) నుంచి లాతూర్‌కు ఆమె హెలికాప్ట‌ర్ (Helicopter)లో బ‌య‌ల్దేరాల్సి ఉంది. అయితే, చివ‌రి నిమిషంలో మంత్రి ప్ర‌యాణించాల్సిన‌ హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య (Technical Issue) త‌లెత్తింది. స‌మ‌స్య‌ను పైల‌ట్ ముందుగానే గుర్తించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది. ఇక తాజాగా ఘ‌ట‌న‌తో మంత్రి త‌న ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నారు.

కాగా, గ‌త నెల 28న బారామ‌తిలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్ర‌మాదంలో మ‌హారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. స్థానిక సంస్థ‌ల ఎన్నికల నేప‌థ్యంలో బారామ‌తిలో జ‌ర‌గ‌నున్న 4 స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు గాను అజిత్ ప‌వార్ చార్ట‌ర్డ్ విమానంలో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విమానం క్రాష్ ల్యాండింగ్ అవ‌డంతో అజిత్ ప‌వార్‌, ఆయ‌న‌తోపాటు ప్ర‌యాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు. అజిత్ ప‌వార్ మ‌ర‌ణంతో ఆయ‌న భ‌ర్యా సునేత్ర ప‌వార్ డిప్యూటీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

https://x.com/ians_india/status/2018573645120143520

Advertisement
Advertisement