Viral Video | శోభనం గదిలా మారిన రైలు కోచ్.. నెట్టింట వీడియో వైరల్..!
Viral Video | రైలులోని ఓ ఫస్ట్ ఏసీ కోచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా ప్రయాణానికి ఉపయోగించే రైలు బోగీని నూతన దంపతుల కోసం హనీమూన్ సూట్‌లా రెడీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వినూత్న ప్రయత్నంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Viral Video | రైలులోని ఓ ఫస్ట్ ఏసీ కోచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా ప్రయాణానికి ఉపయోగించే రైలు బోగీని నూతన దంపతుల కోసం హనీమూన్ సూట్‌లా రెడీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వినూత్న ప్రయత్నంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న ఓ రైలులో ఈ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఓ ఫస్ట్ ఏసీ క్యాబిన్‌ను బెలూన్స్, పూలు, గులాబీ రేకులతో అందంగా అలరించారు. రైలు లోపల ఐ లవ్ యూ అంటూ పోస్టర్లు వేశారు.
జాల్నాకు చెందిన నూతన దంపతుల కోసం ఔరంగాబాద్‌కు చెందిన ‘రాహత్ రూమ్ డెకరేషన్’ బృందం ఈ అలంకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. రైలు జాల్నా స్టేషన్‌కు చేరుకునేలోపే కోచ్‌ను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సదరు జంట ఫస్ట్ ఏసీ క్యాబిన్‌లోని రెండు బెర్తులను ముందుగానే రిజర్వ్ చేసుకోవడంతో ఈ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం రాలేదని వారు వెల్లడించారు. వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు కూడా స్పందించారు. ప్రయాణికులు మొత్తం క్యాబిన్‌ను బుక్ చేసుకున్న నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘన జరుగలేదని స్పష్టం చేశారు. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకుండా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటే వ్యక్తిగతంగా కేటాయించిన క్యాబిన్‌లో పరిమిత స్థాయిలో డెకరేషన్ చేసుకోవచ్చని చెప్పారు.
సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని సరదాగా ‘హనీమూన్ ఆన్ వీల్స్’, ‘సుహాగ్‌రాత్ ఎక్స్‌ప్రెస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బెలూన్లు, అలంకరణ సామగ్రి వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పరిశుభ్రతపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలంటూ పలువురు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తున్నారు.
A First AC coach has reportedly been decorated with a "honeymoon-style" setup.
The Railway administration must explain: is it's allowed? @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @PMOIndia pic.twitter.com/ofE4AGawJH
— The Nalanda Index (@Nalanda_index) July 7, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





