Ajit Pawar | నేను ఊపిరి పీల్చుకున్నా.. 18 నెలల క్రితం అజిత్ పవార్ కీలక వ్యాఖ్య
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు 18 నెలల క్రితమే పెను ప్రమాదం తప్పింది. 2024 జులై నెలలో దట్టమైన మేఘాల కారణంగా దృశ్యమానత లోపించడంతో.. తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. దాంతో అజిత్ పవార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Ajit Pawar | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు 18 నెలల క్రితమే పెను ప్రమాదం తప్పింది. 2024 జులై నెలలో దట్టమైన మేఘాల కారణంగా దృశ్యమానత లోపించడంతో.. తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. దాంతో అజిత్ పవార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండైన తర్వాత తాను ఊపిరి పీల్చుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే..?
2024 జులై నెలలో నాగ్‌పూర్ నుంచి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్‌తో కలిసి అజిత్ పవార్ గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసేందుకు బయల్దేరారు. ఇక దట్టమైన మేఘాలను చూసి అజిత్ పవార్ భయపడిపోయారు. తనతో పాటు సీఎం, మంత్రికి కిటికీ గుండా ఆ దృశ్యాలను చూపిస్తూ.. ఆందోళనకు గురయ్యారు అజిత్ పవార్. ఇక దృశ్యమానత లోపించడం కారణంగా హెలికాప్టర్ కూడా దారి తప్పింది.
ఈ క్రమంలో ఫడ్నవీస్ కల్పించుకుని.. ఏం భయపడకండి.. ధైర్యంగా ఉండాలని అజిత్‌కు భరోసానిచ్చారు. ఎందుకంటే ఇలాంటి ఆరు ప్రమాదాల నుంచి ఫడ్నవీస్ సురక్షితంగా బయటపడ్డారు. కాబట్టి ఆ ధైర్యంతోనే అజిత్‌కు భరోసా ఇచ్చారు. మొత్తానికి పైలట్ తన నైపుణ్యంతో.. హెలికాప్టర్‌ను సురక్షితంగా గడ్చిరోలిలో ల్యాండ్ చేశారు.
గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ.. గాల్లో ఉండగా చోటు చేసుకున్న పరిణామాన్ని గుర్తు చేసుకున్నారు. దట్టమైన మేఘాల నుంచి బయటకు వచ్చిన హెలికాప్టర్ కిటికీలో నుంచి తనకు పక్కనే సామంత్ ల్యాండింగ్ ప్రదేశానికి వచ్చామని చూపించడంతో తాను ఊపిరి పీల్చుకున్నానని అజిత్ పవార్ చెప్పారు.
18 నెలల తర్వాత
సరిగ్గా 18 నెలల తర్వాత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేసింది. బారామతిలో 8.45 గంటల సమయంలో లియర్‌జెట్45 కూలిపోవడంతో అజిత్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ పర్సనల్ సెక్రటరీ, సహాయకుడు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Aircraft Crash Land | బారామతిలో కూలిన శిక్షణ విమానం.. గతంలో అజిత్ పవార్ మరణించింది కూడా ఇక్కడే
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



