త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deputy CM Ajit Pawar | విమాన ప్రమాదంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం.. డీజీసీఏ వెల్ల‌డి..

Deputy CM Ajit Pawar | బారామ‌తి ఎయిర్‌పోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన సంఘ‌ట‌న‌లో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ అధినేత అజిత్ ప‌వార్ (66) దుర్మ‌ర‌ణం చెందార‌ని డీజీసీఏ వెల్ల‌డించింది. ఆ విమానంలో ఆయ‌న‌తోపాటు ప్ర‌యాణిస్తున్న మొత్తం 6 మంది కూడా మ‌ర‌ణించార‌ని డీజీసీఏ అధికారికంగా ప్ర‌క‌టించింది.

S

National | Published On Jan 28, 2026, 10.11 am IST

Deputy CM Ajit Pawar | విమాన ప్రమాదంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం.. డీజీసీఏ వెల్ల‌డి..
Advertisement

Deputy CM Ajit Pawar | బారామ‌తి ఎయిర్‌పోర్టులో విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన సంఘ‌ట‌న‌లో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ అధినేత అజిత్ ప‌వార్ (66) దుర్మ‌ర‌ణం చెందార‌ని డీజీసీఏ వెల్ల‌డించింది. ఆ విమానంలో ఆయ‌న‌తోపాటు ప్ర‌యాణిస్తున్న మొత్తం 6 మంది కూడా మ‌ర‌ణించార‌ని డీజీసీఏ అధికారికంగా ప్ర‌క‌టించింది. అజిత్ ప‌వార్ ప్ర‌యాణిస్తున్న చార్ట‌ర్డ్ ఫ్లైట్‌ను పైల‌ట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌కు య‌త్నించ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఒక్క‌సారిగా కూప్ప‌కూలింది. దీంతో ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నిక‌ల నేప‌థ్యంలో బుధ‌వారం త‌న నియోజ‌క‌వ‌ర్గం బారామ‌తిలో జ‌రిగాల్సిన 4 బ‌హిరంగ స‌భ‌ల‌తోపాటు ప‌లు ర్యాలీల్లోనూ అజిత్ ప‌వార్ పాల్గొనాల్సి ఉంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ముంబైలో ఆయ‌న విమానం టేకాఫ్ అవ‌గా 9 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. విమానం కూలిన వెంట‌నే పెద్ద ఎత్తున మంట‌లు వ్యాపించాయి. ద‌ట్టంగా పొగ కూడా అలుముకుంది. దీంతో ప్ర‌మాద తీవ్ర‌త అధికంగా ఉంద‌ని అధికారులు ముందుగానే గుర్తించారు. అజిత్ ప‌వార్‌తోపాటు, విమానంలో ప్ర‌యాణిస్తున్న ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది, ఇత‌ర ప్ర‌యాణికుల‌ను ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స‌మీపంలోని ప‌లు హాస్పిట‌ల్స్‌కు త‌రలించారు. అయితే అప్ప‌టికే వారు మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు.

అజిత్ ప‌వార్ మ‌ర‌ణ వార్తను మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో అత్యంత విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొంటున్నారు. కాగా ఘ‌ట‌నా స్థ‌లం నుంచి ఇప్ప‌టికే మృత‌దేహాల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఘ‌ట‌న గురించి స‌మాచారం అందిన వెంట‌నే అజిత్ ప‌వార్ భార్య సునేత్ర‌, సోద‌రి సుప్రియా సూలే హుటాహుటిన బారామ‌తి బ‌యల్దేరారు. అజిత్ ప‌వార్ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు కాగా ఆయ‌న నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ గా ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న ఎన్‌సీపీ వ్య‌వ‌స్థాప‌కుడు శ‌ర‌ద్ ప‌వార్ సోద‌రుడి కుమారుడు. ఎన్‌సీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా, మ‌హారాష్ట్ర‌కు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆర్థిక‌, ప్ర‌ణాళిక‌, క్రీడ‌లు, మైనారిటీ అభివృద్ధి శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

https://x.com/Himanshu_UK13/status/2016362462598324238

Advertisement

తాజావార్తలు

Advertisement