త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deputy CM Ajit Pawar | బిగ్ బ్రేకింగ్‌.. విమానం కుప్పకూలి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మరణం

Deputy CM Ajit Pawar | మ‌హారాష్ట్ర బారామ‌తిలో ఘోర విమాన ప్ర‌మాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామ‌తిలో జ‌ర‌గ‌నున్న స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు గాను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ చార్ట‌ర్డ్ విమానంలో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

S

National | Published On Jan 28, 2026, 9.36 am IST

Deputy CM Ajit Pawar | బిగ్ బ్రేకింగ్‌.. విమానం కుప్పకూలి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ దుర్మరణం
Advertisement

Deputy CM Ajit Pawar | మ‌హారాష్ట్ర బారామ‌తి ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్ర‌మాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామ‌తిలో జ‌ర‌గ‌నున్న 4 స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు గాను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ అధినేత అజిత్ ప‌వార్ చార్ట‌ర్డ్ విమానంలో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విమానం క్రాష్ ల్యాండింగ్ అవ‌డంతో అజిత్ ప‌వార్‌, ఆయ‌న‌తోపాటు ప్ర‌యాణిస్తున్న మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు.. తీవ్ర గాయాలతో ఉన్న వారందరినీ చికిత్స నిమిత్తం హుటాహుటిన స‌మీపంలోని హాస్పిట‌ళ్ల‌కు త‌ర‌లించారు. కానీ ఫలితం దక్కలేదు. విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని తెలుస్తోంది. ప్ర‌మాద తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో అజిత్ ప‌వార్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా ఉంది.. అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డడంతో పైల‌ట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కు య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అదుపు త‌ప్పిన విమానం కూలిపోయింద‌ని అధికారులు అంటున్నారు.  క్రాష్ ల్యాండింగ్ అనంత‌రం పెద్ద ఎత్త‌న మంట‌లు చెల‌రేగ‌గా ప్ర‌మాద తీవ్రత అధికంగానే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో సంబంధిత అధికారులు ఇప్ప‌టికే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ముంబై నుంచి బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు విమానం టేకాఫ్ అవ‌గా 9 గంట‌ల‌కు ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నికల నేప‌థ్యంలో బారామ‌తిలో అజిత్ ప‌వార్ ప‌లు ర్యాలీల‌లో పాల్గొనాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement