త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Magh Mela Snan | మౌని అమావాస్య‌.. త్రివేణి సంగ‌మంలో భ‌క్తుల‌ స్నానాలు..!

Magh Mela Snan | మాఘ‌మేళా, మౌని అమావాస్య సంద‌ర్భంగా ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగ‌మానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తును భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి సంగ‌మంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మాఘ మేళాలో మౌని అమావాస్య మూడోది.

P

National | Published On Jan 18, 2026, 3.46 pm IST

Magh Mela Snan | మౌని అమావాస్య‌.. త్రివేణి సంగ‌మంలో భ‌క్తుల‌ స్నానాలు..!
Advertisement

Magh Mela Snan | మాఘ‌మేళా, మౌని అమావాస్య సంద‌ర్భంగా ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగ‌మానికి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తును భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి సంగ‌మంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మాఘ మేళాలో మౌని అమావాస్య మూడోది. దాంతో పెద్ద సంఖ్య‌లో సాధువులు, భ‌క్తులు ఘాట్ల‌కు చేరుకొని స్నానాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రయాగ్‌రాజ్ ప‌రిస‌రాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. వేకువ జాము నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు స‌న్నానాలు ఆచ‌రించిన‌ట్లుగా అధికార వ‌ర్గాలు తెలిపాయి. మౌని అమావాస్య నేప‌థ్యంలో భ‌క్తులు స‌న్నానాలు చేసేందుకు వీలుగా 12,100 అడుగుల పొడ‌వైన ఘాట్ల‌ను నిర్మించారు. భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. భ‌క్తులు సైతం భద్రతా నియమాలు పాటిస్తూ స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పెద్ద ఎత్తున మోహ‌రించారు. డ్రోన్లు, సీసీటీవీలతో నిఘా వేశారు.

ఇదిలా ఉండ‌గా.. మాఘ‌మేళాలో స్వ‌ల్ప ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. స్వామి అవిముక్తేశ్వరానంద మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ప‌ల్ల‌కీలో వ‌చ్చారు. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు బ్రిడ్జ్ నెం. 4 బారికేడ్లను పగలగొట్టి గొడవ సృష్టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాగ్‌రాజ్ క‌లెక్టర్ మనీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, సంప్రదాయానికి విరుద్ధంగా ఆయ‌న అనుమతి లేకుండా తన పల్లకీలో సంగమంలో స్నానం చేయడానికి వ‌చ్చార‌ని తెలిపారు. ఆ స‌మంలో సంగమం వద్ద భారీగా జనం ఉన్నార‌ని, ప‌లుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అనుమతి లేకుండా వచ్చి ప‌ట్టువీడ‌లేద‌న్నారు. ఆయన మద్దతుదారులు బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగార‌న్నారు. ఈ విష‌యంలో విచారిస్తున్నామ‌ని.. అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రిపి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement