త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Jobs | బ్యాంకుల్లో కొలువుల జాత‌ర‌.. 10,177 పోస్టుల‌తో నోటిఫికేష‌న్లు..

Bank Jobs | ప్ర‌భుత్వ ఉద్యోగం (Government Jobs) చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. దానికి పోటీ అధికంగానే ఉంటుంది. నిర్ధిష్ఠ ల‌క్ష్యంతో కృషి చేసిన‌వారికే ఆ ఉద్యోగం సొంత‌మ‌వుతుంది. మ‌న‌తోపాటు కుంటుంబ‌ బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేస్తుంది.

G

National | Published On Jul 5, 2026, 8.48 am IST

Bank Jobs | బ్యాంకుల్లో కొలువుల జాత‌ర‌.. 10,177 పోస్టుల‌తో నోటిఫికేష‌న్లు..
Advertisement

Bank Jobs | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ ఉద్యోగం (Government Jobs) చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. దానికి పోటీ అధికంగానే ఉంటుంది. నిర్ధిష్ఠ ల‌క్ష్యంతో కృషి చేసిన‌వారికే ఆ ఉద్యోగం సొంత‌మ‌వుతుంది. మ‌న‌తోపాటు కుంటుంబ‌ బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేస్తుంది. ఇలాంటి వారికోస‌మే దేశంలోని ప్ర‌భుత్వ రంగ‌ బ్యాంకులు (Bank Jobs) వేల ఖాళీల‌తో నోటీఫికేష‌న్లు విడుద‌ల చేశాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీపీఎస్ సౌజ‌న్యంతో ప‌లు బ్యాంకులు నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్టాయి. స‌ర్కారు కొలువు చేయాల‌ని క‌ల‌లుగంటున్న వారు ఇక ఆల‌స్యం చేయ‌కుండా ప్రిప‌రేష‌న్ షురూ చేయండి.. ఉద్యోగం సాధించండి..

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు..

దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ‌ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer- PO) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ ప్రారంభించింది. అర్హత, ఆసక్తి క‌లిగిన‌ అభ్యర్థులు sbi.bank.in ద్వారా జూలై 8 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఎంపికైన వారికి బేసిక్ పే రూ.48,480 ఉంటుంది. అల‌వెన్సులు క‌లుపుకొని సీటీసీ దాదాపు రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.21.91 ల‌క్ష‌ల వ‌ర‌కు అందుతుంది.

మొత్తం ఖాళీలు- 1500

ఇందులో 1,446 రెగ్యుల‌ర్ (జ‌న‌ర‌ల్ 588, ఎస్సీ 216, ఎస్టీ 108, ఓబీసీ 390, ఈడబ్ల్యూఎస్​ 144), 54 బ్యాక్‌లాగ్ పోస్టులు (ఎస్సీ-18, ఎస్టీ- 36) ఉన్నాయి.

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎస్బీఐ అవకాశం కల్పించింది. అయితే, వీరు ఇంటర్వ్యూకి ఎంపికైతే.. 2026, సెప్టెంబర్ 30న లేదా అంతకంటే ముందే డిగ్రీ పాసైనట్లు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్​ 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏండ్ల‌ మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం..

ఎస్బీఐ పీఓ ఎంపిక మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ విధానంలో జ‌రుగుతుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు గాను 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. గంట ప‌రీక్ష పూర్తి చేయాలి. ఇంగ్లిష్-40 ప్రశ్నలు (20 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-30 (20 నిమిషాలు), రీజనింగ్‌-30 మార్కులు (20 నిమిషాలు) ఉంటాయి. అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రతి కేటగిరీలోని ఖాళీలకు దాదాపు 10 రెట్లు ఉన్న అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ ఎగ్జామ్‌: దీనిని రెండు విధాలుగా నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్- 200 మార్కులు, డిస్క్రిప్టివ్ టెస్ట్ - 30 మార్కులు. మెయిన్స్‌ ఆన్‌లైన్‌ అబ్జెక్టివ్‌లో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు 60 మార్కులు (50 నిమిషాలు), డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 30 ప్రశ్నలు 60 మార్కులు (45 నిమిషాలు), జనరల్‌ అవేర్‌నెస్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్‌ పరిజ్ఞానం 60 ప్రశ్నలు 60 మార్కులు (45 నిమిషాలు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు 20 మార్కుల (40 నిమిషాలు)తో మొత్తం 170 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు. కాలవ్యవధి 3 గంటలు. డిస్క్రిప్టివ్ టెస్ట్​లో 3 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. కాలవ్యవధి 30 నిమిషాలు. మొత్తంగా ఈ రెండింటిని కలిపితే మెయిన్​ ఎగ్జామ్​ అనేది 230 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఫేజ్-3: సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తుల‌కు చివరి తేదీ: జూలై 8
ప్రిలిమ్స్‌ పరీక్ష: ఆగస్టు
మెయిన్స్‌ పరీక్ష: సెప్టెంబర్‌
ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌: అక్టోబర్‌- నవంబర్ నెల‌ల్లో
వెబ్‌సైట్‌: sbi.bank.in

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో

దేశంలో రెండో అతిపెద్ద ప్ఱ‌భుత్వ రంగ బ్యాంకు అయిన‌ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా త‌న అనుబంధ సంస్థ బ‌రోడా గ్లోబ‌ల్ షేర్డ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (BGSSS) వివిధ విభాగాల్లో 438 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో బ్యాంకింగ్ ఆప‌రేష‌న్స్‌, సేల్స్‌, ఐటీ, హెచ్ఆర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆస‌క్తి క‌లిగిన వారు https://www.bgss.inలో జూలై 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు.

మొత్తం ఖాళీలు: 438

ఇందులో స్క్రూటినైజ‌ర్ 5, ఫీల్డ్ సేల్స్ ఆఫీస‌ర్ 240, టెలీ క‌లెక్ష‌న్ ఏజెంట్ 100, ట్రేడ్ ఫైనాన్స్ ఆప‌రేష‌న్స్ 25, ఎగ్జిక్యూటివ్ 40, రిస్క్ రివ్యూ ఆఫీస‌ర్ 1, ఎంఐఎస్ అన‌లిస్ట్ 1, డిప్యూటీ మేనేజ‌ర్ (అడ్మిన్‌, హెచ్ఆర్‌) 1, కంపెనీ సెక్రెట‌రీ (అసోసియేట్‌) 1, బిజినెస్ హెడ్ 1, ఎగ్జిక్యూటివ్ 20, ప్రొక్యూర్‌మెంట్ ఆఫీస‌ర్ 1, డెస్క్‌టాప్ అన‌లిస్ట్ 1, హెచ్ కాంప్లియెన్స్ ఆఫీస‌ర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా
ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: జూలై 15
పూర్తివివ‌రాల‌కు: https://www.bgss.in

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీస‌ర్ పోస్టులు

ముంబై ప్రధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ స్ట్రీమ్‌లో (GBO Stream) క్రెడిట్‌ ఆఫీసర్ (Credit Officer) పోస్టుల భర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టించింది. మొత్తం 779 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఆస‌క్తి క‌లిగిన‌వారు జూలై 20 వ‌ర‌కు www.bankofindia.bank.inలో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.64,820 నుంచి రూ.1,20,940 వ‌రకు జీతం వ‌స్తుంది.

క్రెడిట్ ఆఫీసర్ (ఎస్‌ఎంజీఎస్‌-II)- 677 (ఎస్సీ102, ఎస్టీ 57, ఓబీసీ 180, ఈడబ్ల్యూఎస్​ 69, జనరల్​ 274)
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-III)- 61 (ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్​ 8, జనరల్​ 22)
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-IV)- 41 (ఎస్సీ 6, ఎస్టీ 2, ఓబీసీ 9, ఈడబ్ల్యూఎస్​ 3, జనరల్​ 21)

విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణుల‌వ్వాలి. లేదా సీఏ, సీఎంఏ-ఐసీడబ్ల్యూఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం త‌ప్ప‌నిస‌రి. 2026 జూన్​ 1 నాటికి క్రెడిట్​ ఆఫీసర్​ ఎంఎంజీఎస్‌-II పోస్టులకు 25 నుంచి 32, ఎంఎంజీఎస్‌-III కు 28 నుంచి 38, ఎస్‌ఎంజీఎస్‌-IV కు 32 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలి.

ఎంపిక విధానం: అప్ల‌య్‌ చేసిన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎంపిక ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే ఆన్‌లైన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ లేదా రెండు పద్ధతుల ద్వారా ఎంపిక ఉంటుంది. రెండూ నిర్వహిస్తే ముందుగా ఆన్​లైన్​ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఆన్​లైన్​ ఎగ్జామ్​ లేకుంటే అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 125 మార్కుల ఉంటుంది. అందులో ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత) 100 ప్రశ్నలు 100 మార్కులు. 2 గంటల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తుల‌కు చివరి తేదీ: జూలై 20
వెబ్‌సైట్‌: www.bankofindia.bank.in


6715 పోస్టుల‌తో IBPS ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సోన‌ల్ సెలెక్ష‌న్ (IBPS) 11 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (Probationary Officer) లేదా మేనేజ్‌మెంట్ ట్రెయినీ (management trainee) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేస‌న్ విడుద‌ల చేసింది. జూలై 21 వ‌రకు ద‌ర‌ఖాస్తు గ‌డువు ఉంది. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఉద్యోగం సాధిస్తే ప్ర‌తినెల రూ.74,000 నుంచి రూ.76,000 వ‌ర‌కు జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 6715

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా- 1900 (ఎస్సీ 285, ఎస్టీ 142, ఓబీసీ 513, ఈడ‌బ్ల్యూఎస్ 190, జ‌న‌ర‌ల్ 770)
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 500 (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 513, ఈడ‌బ్ల్యూఎస్ 135, జ‌న‌ర‌ల్ 203)
బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌- 1100 (ఎస్సీ 165, ఎస్టీ 82, ఓబీసీ 297, ఈడ‌బ్ల్యూఎస్ 110, జ‌న‌ర‌ల్ 446)
సెంట్ర‌ల్ బ్యాంక్‌- 1500 (ఎస్సీ 225, ఎస్టీ 112, ఓబీసీ 405, ఈడ‌బ్ల్యూఎస్ 150, జ‌న‌ర‌ల్ 608)
సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 500 (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడ‌బ్ల్యూఎస్ 50, జ‌న‌ర‌ల్ 203)
ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్‌ బ్యాంక్‌- 550 (ఎస్సీ 84, ఎస్టీ 41, ఓబీసీ 148, ఈడ‌బ్ల్యూఎస్ 54, జ‌న‌ర‌ల్ 223)
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌- 504 (ఎస్సీ 76, ఎస్టీ 38, ఓబీసీ 136, ఈడ‌బ్ల్యూఎస్ 50, జ‌న‌ర‌ల్ 204)
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌- 504 (ఎస్సీ 24, ఎస్టీ 13, ఓబీసీ 47, ఈడ‌బ్ల్యూఎస్ 15, జ‌న‌ర‌ల్ 62)

అర్హ‌త‌: అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూట‌ర్‌పై అవ‌గాహ‌న‌, భాష‌పై ప‌ట్టు త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 20 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. లేదా 1996 జూలై 2 నుంచి 2006 జూలై 1 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.

ఎంపిక విధానం

మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌ట ప్రిలిమ్స్‌, అందులో అర్హ‌త సాధించిన వారికి మెయిన్స్‌. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఉంటుంది.
ప్రిలిమ్స్‌: మొత్తం 100 ప్ర‌శ్న‌లు, వంద మార్కుల‌కు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు), న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 35 (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ 35 (40 మార్కులు) ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి సెక్ష‌న్‌కు 20 నిమిషాల చొప్పున 60 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. సెక్ష‌న‌ల్ క‌టాఫ్ ఉంటుంది. అర్హులైన వారిని మెయిన్స్‌కు ఆహ్వానిస్తారు.

మెయిన్స్‌: మొత్తం 170 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 200 మార్కులు ఉంటాయి. రీజ‌నింగ్ 40 (60 మార్కులు-45 నిమిషాలు), జ‌న‌ర‌ల్, ఎకాన‌మీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్ర‌శ్న‌లు (60 మార్కులు- 35 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్ర‌శ్న‌లు (20 మార్కులు- 35 నిమిషాలు), డాటా అనాలిసిస్ అండ్ ఇంట‌ర్‌ప్రిటేష‌న్ 40 (60 మార్కులు- 45 నిమిషాలు), డిక్క్రిప్టివ్ పేప‌ర్ (ఎస్సే అండ్ కాంప్ర‌హెన్ష‌న్‌) 2 ప్ర‌శ్న‌లు (25 మార్కులు-30 నిమిషాలు). మొత్తం 160 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. ప్ర‌తి త‌ప్పు జ‌వాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

ఇంట‌ర్వ్యూ: మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: జూలై 21
అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.175
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌: ఆగ‌స్టులో
ప్రిలిమ్స్‌: ఆగ‌స్టు 22, 23 తేదీల్లో
ప్రిలిమ్స్ ఫ‌లితాలు: సెప్టెంబ‌ర్‌లో
మెయిన్స్ ఎగ్జామ్‌: అక్టోబ‌ర్ 4న‌
ఫ‌లితాలు: న‌వంబ‌ర్‌లో
ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌: న‌వంబ‌ర్‌లో
ఇంట‌ర్వ్యూ: న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌
తుది ఫ‌లితాలు: 2027 జ‌న‌వ‌రిలో
వెబ్‌సైట్‌: www.ibps.in

ఐబీపీఎస్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ పూర్తిచేసిన‌వారు జూలై 21 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్ మెంట్ ప్రక్రియ మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. ఎంపికైన వారికి ప్ర‌తినెల రూ.48,480 నుంచి రూ.85,920 వ‌ర‌కు జీతం అందుతుంది.

మొత్తం ఖాళీలు- 745

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 190 పోస్టులు
అర్హ‌త‌లు: అగ్రికల్చర్‌, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్​ కోఆపరేషన్, కో-ఆపరేషన్ అండ్​ బ్యాంకింగ్, ఆగ్రో-ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బీటెక్​ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్​ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, సెరికల్చర్, ఫిషరీస్‌ ఇంజినీరింగ్‌లో నాలుగు సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఐటీ ఆఫీసర్: 301 పోస్టులు

అర్హ‌త‌లు: ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్​/ టెక్నాలజీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్​ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదంటే పీజీ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్​ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్)లో పాసై ఉండాలి.

లా ఆఫీసర్: 105 పోస్టులు

అర్హ‌త‌లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేయాలి. బార్​ కౌన్సిల్​లో అడ్వకేట్​గా ఎన్​రోల్​ చేసుకుని ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి.

హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌: 60 పోస్టులు

అర్హ‌త‌లు: డిగ్రీతో పాటు హెచ్‌ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్, లేబర్ లా, సోషల్ వర్క్ తదితరాల్లో రెండేండ్ల‌ పూర్తి పీజీ, డిప్లొమా చేయాలి.

రాజ్‌భాష అధికారి: 89 పోస్టులు

అర్హ‌త‌లు: హిందీలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లిష్ చదివి ఉండాలి. లేదా సంస్కృతంలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్‌లో హిందీ, ఇంగ్లిష్ చదివిన వారు అర్హులు.

వయోపరిమితి: 2026, జూలై 1 నాటికి పై అన్ని పోస్టులకు 20 నుంచి 30 ఏండ్ల‌ మధ్య వయసు ఉండాలి. 1996, జూలై 2 నుంచి 2006 జూలై 1 మధ్య జన్మించాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్య‌ర్థుల ఎంపిక మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష.. ఆ రెండిటిలో అర్హ‌త సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్‌: మొత్తం 125 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(25 ప్రశ్నలు, 25 మార్కులు), రీజనింగ్(25 ప్రశ్నలు, 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు, 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్(25 ప్రశ్నలు, 50 మార్కులు) కలిపి మొత్తం 125 మార్కులకు ఉంటుంది. సమయం 80 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్​ ఎగ్జామ్​: ఐటీ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌, లా ఆఫీసర్​, రాజ్యభాష అధికారి పోస్టులకు 225 మార్కులకు పరీక్ష ఉంటుంది. అయితే ప్రశ్నలు వచ్చే విభాగాలు మారతాయి. ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్క్​ కోత ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తుల‌కు చివరి తేది: జూలై 21
ఆన్​లైన్​ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు నెల‌లో
ఫలితాలు: సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌
మెయిన్ పరీక్ష తేదీ, ఫలితాలు: నవంబర్‌
ఇంటర్వ్యూ: నవంబర్‌/డిసెంబర్‌ 2026
ఫైనల్​ ఫలితాల ప్రకటన: జనవరి 2027
వెబ్​సైట్​: www.ibps.in

Advertisement
Advertisement