త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CDS | త‌దుప‌రి సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి..

CDS | భార‌త సాయుధ బ‌ల‌గాల నూత‌న త్రివిద ద‌ళాధిప‌తిగా (CDS) రిటైర్డ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఎస్ఎస్ రాజా సుబ్రమణి (N S Raja Subramani) నియమితుల‌య్యారు. దీంతోపాటు ఆయ‌న సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు తీసుకోనున్నారు.

G

National | Published On May 9, 2026, 9.35 am IST

CDS | త‌దుప‌రి సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి..
Advertisement

CDS | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త సాయుధ బ‌ల‌గాల నూత‌న త్రివిద ద‌ళాధిప‌తిగా (CDS) రిటైర్డ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఎస్ఎస్ రాజా సుబ్రమణి (N S Raja Subramani) నియమితుల‌య్యారు. దీంతోపాటు ఆయ‌న సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈమేర‌కు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనుంది. ఈ నేప‌థ్యంలో అనిల్ చౌహాన్ స్థానంలో త‌దుప‌రి సీడీఎస్‌గా రాజా సుబ్రమణిని నియమించింది. చౌహాన్ ప‌ద‌వీకాలం ముగిసిన వెంట‌నే ఆయ‌న బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు.

రక్షణ రంగంలో విశేషమైన అనుభవం

లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణికి రక్షణ రంగంలో విశేషమైన అనుభవం ఉన్న‌ది. ప్రస్తుతం ఆయ‌న జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా పని చేస్తున్నారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 1 నుంచి ఆ బాధ్యతలను నిర్వ‌హిస్తున్నారు. అంత‌కుముందు భారత సైన్యంలో ఆర్మీ వైస్ చీఫ్‌గా (2024 జూలై నుంచి 2025 జూలై వరకు) సేవ‌లు అందించారు. అలాగే ముఖ్యమైన కమాండ్, స్టాఫ్ పదవుల్లోనూ పని చేశారు. ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా రాజా సుబ్రమణి విధులు నిర్వర్తించారు.

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని భౌగోళిక పరిస్థితులపై, ఆపరేషనల్ డైనమిక్స్‌పై లోతైన అవగాహన కలిగి ఉన్నారని రక్షణ శాఖ ప్రశంసించింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా, నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఇలా పలు అత్యున్నత పదవులు ఆయన అధిరోహించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM), సేన పతకం (SM), విశిష్ట సేవా పతకం (VSM) వంటి గౌరవ పురస్కారాలతో సత్కరించింది.

చీఫ్‌ ఆఫ్‌ నావల్ స్టాఫ్‌గా..

అదేవిధంగా చీఫ్‌ ఆఫ్‌ నావల్ స్టాఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ (Krishna Swaminathan) నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అదే రోజున వైస్ అడ్మిరల్ కృష్ణ స్మామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2028 డిసెంబర్ 31, వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు!

మీరు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పొగ తాగుతున్నారా.. మిమ్మ‌ల్ని పోలీసులు ప‌ట్టుకెళ్ల‌డం ఖాయం!

రేప‌టితో ముగియ‌నున్న సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్‌

భార్యాభ‌ర్తల‌ మ‌ధ్య గొడ‌వ‌.. స‌ర్దిచెప్పేందుకు వ‌చ్చిన అత్త‌పై అల్లుడి లైంగిక‌దాడి

ట్యాగ్స్:

Advertisement
Advertisement