Self Enumeration | రేపటితో ముగియనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్
Self Enumeration | రాష్ట్రంలో జనగణన (Census) కొనసాగుతున్నది. ఆదివారం (మే 10)తో తొలివిడతలో భాగంగా చేపట్టిన స్వీయగణన (Self Enumeration) ముగియనుంది. దీంతో ప్రజలు తమ వివరాలను జనాభా లెక్కల పోర్టల్ https://se.census.gov.inలో నమోదుచేసుకోవాలని అధికారులు సూచించారు.
Self Enumeration | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో జనగణన (Census) కొనసాగుతున్నది. ఆదివారం (మే 10)తో తొలివిడతలో భాగంగా చేపట్టిన స్వీయగణన (Self Enumeration) ముగియనుంది. దీంతో ప్రజలు తమ వివరాలను జనాభా లెక్కల పోర్టల్ https://se.census.gov.inలో నమోదుచేసుకోవాలని అధికారులు సూచించారు. గత నెల 25న రాష్ట్రంలో స్వీయ గణన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్వీయగణన పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీని తర్వాత రెండో దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు మిగితా 6 ప్రశ్నలకు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ ఉన్నా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చన్నారు. కాగా, తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు ఇవే మొదటిసారి కావడం గమనార్హం.
తొలివిడతలో ఇండ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. మే 11 నుంచి జూన్ 19 వరకు నివాసాలపై మార్కింగ్ చేస్తారు. జనగణన కోసం 1855 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటాయి.

జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. అయితే స్వీయ గణనలో భాగంగా 27 ప్రశ్నలకు జవాబులను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ప్రశ్నలకు సమాధానాలను ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమరేటర్ (Enumerators) నమోదు చేస్తారు. ఎన్ని ఆస్తులున్నాయి?, ఎక్కడెక్కడ ఉన్నాయనే ప్రశ్నలు లాంటివి ఉండవు. ఇంటి నంబర్లు, ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల ప్రస్తావన ఉండదు. ఇల్లు, సౌకర్యాలు, కులం తదితర వివరాలను మాత్రమే తెలపాల్సి ఉంటుంది. మొదటి దశలో కేవలం ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్), ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) కులాల నమోదు ఉంటుంది. ఆ రెండు కేటగిరీల్లో లేని వారిని ఇతరులుగా పరిగణిస్తారు. ‘ఇతరుల’ కులాన్ని రెండో దశ జనగణనలో నమోదు చేస్తారు. జనగణన అధికారులు ఇంటికి వచ్చి అడిగే సాధారణ ప్రశ్నలకూ సమాధానమివ్వనట్లయితే చట్ట ప్రకారం జరిమానా విధింపు, ఇతర చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Census 2027 | కులం, కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు.. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
ఆగస్టు 14, 2026

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
ఆగస్టు 14, 2026

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
- ●Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్డేట్..
- ●Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
- ●Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..
- ●Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
- ●Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం

WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..

Google Quick Share | ఫోన్లను దగ్గరగా ఉంచితే చాలు, డేటా షేర్.. ఆండ్రాయిడ్‌లో క్విక్ షేర్ ఫీచర్‌కు అప్డేట్..

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది

Crow | వీడేం మనిషిరా బాబూ.. మద్యం మత్తులో కాకిని తినేందుకు యత్నం..



