LPG Crisis | భారత్‌లో గ్యాస్ సంక్షోభం.. ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలోని సెక్షన్ 3 అమలుకు గెజిట్..!
LPG Crisis | మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. ఫలితంగా భారత్‌లో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
LPG Crisis | మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. ఫలితంగా భారత్‌లో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద సెక్షన్–3ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని ఆయిల్, గ్యాస్ కంపెనీలు తమ కార్యకలాపాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రభుత్వానికి తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
ఉత్పత్తి, ప్రాసెసింగ్, రిఫైనింగ్, నిల్వ, దిగుమతి, ఎగుమతి, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉన్న సంస్థలన్నీ ఈ మేరకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేటా సేకరించే బాధ్యతను పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC)కు అప్పగించారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సెక్షన్–3 కింద జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే నేరంగా పరిగణించనున్నారు. అవసరమైతే జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం ద్వారా అవసరమైన వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటుంది.
నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించడం, కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ చట్టం ద్వారా కేంద్రం అడ్డుకుంటుంది. ప్రస్తుతం భారత్ తన ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. పశ్చియ ఆసియా దేశాలతో పాటు రష్యా, అమెరికా వంటి దాదాపు 40 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. అలాగే, గ్యాస్ అమెరికా, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా నుంచి వస్తోంది. వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






