త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | అజిత్ ప‌వార్ అకాల మ‌ర‌ణం.. రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాని మోదీ తీవ్ర‌ దిగ్భ్రాంతి

Ajit Pawar | మహారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్‌ పవార్ (Ajit Pawar) ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Draupadi Murmu), ప్ర‌ధాని మోదీ (PM Modi) స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

G

National | Published On Jan 28, 2026, 11.58 am IST

Ajit Pawar | అజిత్ ప‌వార్ అకాల మ‌ర‌ణం.. రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాని మోదీ తీవ్ర‌ దిగ్భ్రాంతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మహారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్‌ పవార్ (Ajit Pawar) ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Draupadi Murmu), ప్ర‌ధాని మోదీ (PM Modi) స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అజిత్ మ‌ర‌ణంపై ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు.

అజిత్ ప‌వార్ మృతి తీర‌ని లోట‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు. మహారాష్ట్ర, స‌హ‌కారం రంగం అభివృద్ధికి ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంద‌న్నారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా పలువురు మరణించడం చాలా బాధాకరం. అజిత్ పవార్ మరణం కోలుకోలేని నష్టం. మహారాష్ట్ర, సహకార రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యలు, మద్దతుదారులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడు కోరుకుంటున్నాని తెలిపారు.

అజిత్ పవార్ ప్రజల నేతగా, కింద స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన నాయకుడ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలనా వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు, పేదలు-అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకితభావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా అజిత్‌ పవార్‌కు నివాళి అర్పించారు.

అజిత్ ప‌వార్ మృతి ప‌ట్ల లోక్‌భ‌లో విప‌క్ష నేత‌, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ విషాద స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌తో తాము ఉన్నామ‌న్నారు. ప‌వార్ కుటుంబానికి ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కొరకు పని చేశారన్నారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement