Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..
Assembly Session | అసెంబ్లీలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ హాల్‌ను (Assembly Central Hall) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనసభ, శాసనమండలి రెండూ ఒకే భవనంలో కొలువుదీరిన విషయం తెలిసిందే.
Assembly Session | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ హాల్‌ను (Assembly Central Hall) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనసభ, శాసనమండలి రెండూ ఒకే భవనంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు తరహాలో అసెంబ్లీ భవనంలోనూ సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేశారు. లాబీలు, ఎమ్మెల్యేల లాంజ్‌ను నవీకరించి దీనిని నిర్మించారు. దీనికి దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు (Sripada Rao) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ హాల్‌ను సోమవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో (Assembly Session) పలు కీలక బిల్లులను ఆమోదానికి శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) బిల్లుతోపాటు ‘హేట్ స్పీచ్’ బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సమగ్ర శిక్షా (టీఎస్ఎస్) 2024-25, పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ (పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ) 2024-25 ఆడిట్ రిపోర్టులను, హైదరాబాద్ మెట్రో రైల్‌కు సంబంధించి 2013 నుంచి 2018 వరకు వార్షిక నివేదికలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ, మండలిలో ప్రవేశపెడుతారు.
తాజావార్తలు
- ●KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్
- ●Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన.. పాల్గొన్న భట్టి విక్రమార్క
- ●Volcanic Eruption | బద్దలైన అగ్నిపర్వతం.. నిలిచిన విమానాలు.. చిక్కుకుపోయిన 1.70లక్షల మంది ప్రయాణికులు
- ●Amazon Cargo Plane | రన్‌వేదాటి రోడ్డుపైకి దూసుకెళ్లిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు దుర్మరణం
- ●RFCL | రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, MBA అభ్యర్థులకు అవకాశం
- ●Horoscope | సెప్టెంబర్ 7 రాశిఫలాలు.. ఈ రాశివారు చాలా సున్నితంగా, సృజనాత్మకంగా ఉంటారు!

KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్

Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన.. పాల్గొన్న భట్టి విక్రమార్క

Volcanic Eruption | బద్దలైన అగ్నిపర్వతం.. నిలిచిన విమానాలు.. చిక్కుకుపోయిన 1.70లక్షల మంది ప్రయాణికులు

Amazon Cargo Plane | రన్‌వేదాటి రోడ్డుపైకి దూసుకెళ్లిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు దుర్మరణం





