CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
CM Vijay | ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సంచలన ప్రకటన చేశారు. చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ సిటీతో (Mega Olympic City)పాటూ ప్రత్యేక మోటార్‌స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చెన్నైలో 'ఫార్ములా 1' రేసింగ్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడులో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సంచలన నిర్ణయాలు ప్రకటించారు. చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ సిటీ (Mega Olympic City)తోపాటూ ప్రత్యేక మోటార్‌స్పోర్ట్స్ సిటీ (Motorsports City)ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అంతేకాదు, చెన్నైలో 'ఫార్ములా 1' రేసింగ్‌ను (Formula 1 race) నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవాళ ఉదయం అసెంబ్లీలో విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చెన్నైలో ప్రపంచ స్థాయి 'తమిళనాడు ఒలింపిక్ సిటీ'ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో అత్యాధునిక క్రీడా మైదానాలు, పరికరాలు, హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక క్రీడా విజ్ఞాన, క్రీడా వైద్య కేంద్రాలు ఉంటాయి. అంతేకాదు, క్రీడాకారులు, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో తమిళనాడు క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా, వారికి అధునాతన శిక్షణ అందించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు.
నగరంలో ఫార్ములా 1-4 రేసులను నిర్వహించడానికి చెన్నైలో ఒక ప్రత్యేక మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. మోటార్ స్పోర్ట్స్‌లో యువత ప్రతిభను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌లను తయారు చేయడానికి శిక్షణ, రేసింగ్ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రపంచ స్థాయి మోటార్ వాహన కార్ రేసింగ్ వేదికలను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటూ ప్రత్యేక వాహన తయారీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం విజయ్ వివరించారు. కాగా, 2028 చివరి నాటికి దేశంలో ఫార్ములా 1 రేసింగ్‌ను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (MYAS) ఇటీవలే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Also Read..
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ
24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
సంబంధిత వార్తలు

CM Vijay | సీఎం విజయ్ సంచలన ప్రకటన.. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
సెప్టెంబర్ 2, 2026

CM Vijay | చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
ఆగస్టు 29, 2026

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
ఆగస్టు 28, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



