Lava Temple | లాహోర్ కోటలో శ్రీరాముని కుమారుడి ఆలయం..
Lava Temple | ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా జీవించిన శ్రీరాముడిని (Sri Rama) దైవంగా కొలుస్తున్నాం. ఆదిపురుషుడు, రఘువంశోద్ధారకుడైన సీతాపతికి భారతదేశం నలుమూలలా ఆలయాలు మనకు కనిపిస్తాయి. అయితే రాముని పెద్ద కుమారుడైన లవుడికి కూడా (Lava Temple) ఆలయం ఉన్నది.
త్రినేత్ర.న్యూస్: ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా జీవించిన శ్రీరాముడిని (Sri Rama) దైవంగా కొలుస్తున్నాం. ఆదిపురుషుడు, రఘువంశోద్ధారకుడైన సీతాపతికి భారతదేశం నలుమూలలా ఆలయాలు మనకు కనిపిస్తాయి. అయితే రాముని పెద్ద కుమారుడైన లవుడికి కూడా (Lava Temple) ఆలయం ఉన్నది. అందులోనూ పాకిస్థాన్‌లో (pakistan). అయోధ్యలో నడయాడిన రాముని కుమారునికి పాకిస్థాన్‌లో ఆలయం ఏంటీ అనుకుంటున్నారా..
సీతారాములకు కలిగిన కవల పిల్లల్లో లవుడు మొదటి వాడు. కుశుడు అతని సోదరుడు. శ్రీరాముని తర్వాత రాజ్యాన్ని లవకుశులు పరిపాలించారు. వీరు లవపురి, కసూర్ నగరాలను స్థాపించారు (హిందూ పురాణాల ప్రకారం). లవుడు తన పేరుతో నిర్మించిన లవపురి ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న లాహోర్ (Lahore) పట్టణం. ది ఫోర్ట్ ఆఫ్ లోహ్‌గా పిలిచే లాహోర్ కోటలోని (Lahore Fort) షాహి ఖితా లోపల లవుడి ఆలయం ఉన్నది. పైకప్పు కూడా లేకుండా ఉన్న ఆలయం కాలక్రమంలో శిథిలమైంది.

లాహోర్ నగరానికి సుమారు 2 వేల ఏండ్లకుపైగా వయస్సు ఉంటుందని చరిత్రకారులు పేర్కొన్నారు. అలాగే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం సరైన సంరక్షణ లేకపోవడంతో శిథిలమైపోయింది. అయితే ఈ ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రాక్ ప్రభుత్వం.. మొఘల్, సిక్కు, హిందూ కాలం నాటి కట్టడాలను పునరుద్ధరించే ప్రాజెక్టును చేపట్టింది.
వాల్ట్‌సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ సహకారంతో ఈ ఆలయాన్ని యథా రూపానికి తీసుకొచ్చారు. దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా, ఇప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. భక్తుల సందర్శనార్ధం పునఃప్రారంభించారు. దీంతోపాటు సిక్కుల కాలానికి చెందిన మహారాజా రంజిత్ సిక్‌కు సంబంధించిన మరో రెండు స్మారక కట్టడాలను కూడా పునరుద్ధరించారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి వీటిని పునరుద్ధరించినట్లు డబ్ల్యూసీఎల్ఏ వెల్లడించింది.

చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలను గురించి ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా డబ్ల్యూసీఎల్ఏ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన అమెరికాకు చెందిన ఓ సిక్కు ట్రావెలర్.. సిక్కుల పాలన కాలంలో (1799-1849) లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. వాటిలో ఇప్పటికే 30 వరకు కనుమరుగయ్యాయని తెలిపారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



