Apple iPhone Duo | ఐఫోన్ డ్యుయోకు క్రేజీ డిమాండ్.. నెలకు ఈఎంఐ ఎంత..?
Apple iPhone Duo | యాపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయో భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. 256 జీబీ వేరియంట్ ప్రారంభ ధరను రూ.2,99,900గా కంపెనీ నిర్ణయించింది. ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడని కొనుగోలుదారుల కోసం యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈఎంఐ సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచింది.
Technology | Published On Oct 24, 2026, 10.23 am IST
Apple iPhone Duo | యాపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయో భారత్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. 256 జీబీ వేరియంట్ ప్రారంభ ధరను రూ.2,99,900గా కంపెనీ నిర్ణయించింది. ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడని కొనుగోలుదారుల కోసం యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈఎంఐ సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచింది. ఐఫోన్ డ్యుయో 512 జీబీ మోడల్ ధర రూ.3,24,900 కాగా, 1 టీబీ వేరియంట్ ధర రూ.3,74,900గా ఉంది. అత్యధిక నిల్వ సామర్థ్యం కలిగిన 2 టీబీ మోడల్ ధరను రూ.4,49,900గా నిర్ణయించారు. ఈ ఫోన్ నైట్ స్కై, స్టార్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తోంది.
నెలకు ఈఎంఐ ఎంత..?
256 జీబీ మోడల్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా 12 నెలల ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేస్తే నెలకు రూ.26,574 చెల్లించాల్సి ఉంటుందని యాపిల్ ఈఎంఐ కాలిక్యులేటర్ వెల్లడిస్తోంది. ఈ స్కీంలో వార్షిక వడ్డీ రేటు 15.99 శాతంగా ఉంది. అదనంగా రూ.7వేల తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ పథకం కింద మొత్తం చెల్లింపు రూ.3,18,888కు చేరుతుంది. క్యాష్‌బ్యాక్ తర్వాత ఫోన్ ధర రూ.2,92,900గా ఉండగా, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే సుమారు రూ.26వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పథకం నో కాస్ట్ ఈఎంఐ కాదని గమనించాలి. యాపిల్ మూడు నెలలు, ఆరు నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. మూడు నెలల పథకంలో నెలకు రూ.97,633, ఆరు నెలల పథకంలో నెలకు రూ.48,817 చెల్లించాలి. రెండు పథకాలలోనూ మొత్తం చెల్లింపు సుమారు రూ.2,92,900గా ఉంటుంది.
నో కాస్ట్ ఈఎంఐ అయితే..
ఐఫోన్ డ్యుయోపై నో కాస్ట్ ఈఎంఐ మూడు, ఆరు నెలల కాలపరిమితులకే పరిమితమని యాపిల్ తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 11 వరకు అమల్లో ఉంటుంది. 512 జీబీ, 1 టీబీ వేరియంట్లను క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆఫర్లతో కొనుగోలు చేస్తే నెలవారీ చెల్లింపులు వరుసగా రూ.28,842, రూ.33,378 నుంచి ప్రారంభమవుతాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన కార్డులపై మాత్రమే తక్షణ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. కనీస లావాదేవీ విలువ రూ.10,001గా ఉండాలి. అర్హత కలిగిన పాత పరికరాన్ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కొత్త ఫోన్ కొనుగోలుపై క్రెడిట్ కూడా పొందవచ్చు.

అదిరిపోయిన ఫీచర్లు..
ఐఫోన్ డ్యుయోలో 7.6 ఇంచుల అంతర్గత డిస్‌ప్లేతోపాటు 5.4 ఇంచుల బాహ్య డిస్‌ప్లేను అందించారు. ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు కనిపించే స్క్రీన్ విస్తీర్ణం ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్‌తో పోలిస్తే 50 శాతం ఎక్కువగా ఉంటుందని యాపిల్ పేర్కొంది. ప్రతిబింబాల వల్ల కలిగే ఇబ్బందిని తగ్గించేందుకు అంతర్గత డిస్‌ప్లేకు నానో టెక్స్చర్ ఫినిష్ ఇచ్చారు. రెండు డిస్‌ప్లేలు 120 హెడ్జ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తాయి. ఈ ఫోన్‌కు గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్, హింజ్ కవర్‌ను అమర్చారు. ముందు, వెనుక భాగాల్లో సిరామిక్ షీల్డ్ రక్షణ కల్పించారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ ఇచ్చారు. ఫోన్‌ను మడిచినప్పుడు ఏర్పడే మడత గుర్తు తగ్గేలా డిజైన్ చేసినట్లు యాపిల్ తెలిపింది. ఈ డివైస్ ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఒకేసారి పలు పనులు చేసుకునేందుకు స్ప్లిట్ వ్యూ మల్టీటాస్కింగ్ సదుపాయం ఉంది. సిరి ఏఐ ఫీచర్‌కు కూడా మద్దతు కల్పించారు. ఈ ఫీచర్‌ను ఆంగ్ల భాషలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
పవర్‌ఫుల్ కెమెరాలు..
ఐఫోన్ డ్యుయోలో ఎ0 ప్రొ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అధిక పనితీరు సమయంలో వేడిని నియంత్రించేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను అమర్చారు. వెనుకవైపు 48 మెగాపిక్సల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సల్ ఫ్యూజన్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. రెండు రెట్ల వరకు ఆప్టికల్ నాణ్యతతో కూడిన జూమ్ సదుపాయం ఉంది. అయితే, ఇందులో ప్రత్యేక టెలిఫొటో కెమెరా లేదు. ముందువైపు 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరాతోపాటు ఫేస్‌టైమ్ వీడియో కాల్స్ కోసం డిస్‌ప్లే కింద అమర్చిన కెమెరాను అందించారు. బాహ్య డిస్‌ప్లే ద్వారా డ్యుయో ప్రివ్యూ, కిడ్ క్యూ వంటి ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. డ్యుయో ప్రివ్యూ ద్వారా ఫొటో తీసుకునే వ్యక్తికి తాను కెమెరాలో ఎలా కనిపిస్తున్నానో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. కిడ్ క్యూ ఫీచర్ యానిమేషన్ల సహాయంతో పిల్లల దృష్టిని కెమెరా వైపు ఆకర్షిస్తుంది.
భారీ డిమాండ్..
ఈ ఫోన్‌లో అంతర్గత డిస్‌ప్లేపై 31 గంటల వరకు, బాహ్య డిస్‌ప్లేపై 44 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని యాపిల్ వెల్లడించింది. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా సుమారు 20 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో కేవలం ఈ-సిమ్ సదుపాయం మాత్రమే ఉంది. సైడ్ బటన్‌లో టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. యూఎస్‌బీ సి కనెక్టర్ కలిగిన ఆయాపిల్ పెన్సిల్‌కు మద్దతును ఈ ఏడాది చివర్లో అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అయిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు స్టాక్ అయిపోయిందని, స్టోర్ల ఎదుట వినియోగదారులు క్యూ కడుతున్నారని రాయిటర్స్ తెలిపింది. ఇక భారత్‌లోనూ స్టాక్ వచ్చిన 10 నిమిషాల్లోనే మొత్తం క్లియర్ అయిందని బ్లింకిట్ తెలిపింది.
తాజావార్తలు
- ●Foreign Currency | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత..
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు
- ●PM Kisan | రైతులకు శుభవార్త.. ఈనెల 30న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
- ●ED Officials | లంచం తీసుకుంటూ.. సీబీఐకి పట్టుబడిన ఈడీ అధికారులు
- ●Lord Uday Nagaraju | దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీ.. పార్లమెంటరీ వ్యవస్థలూ అంతేవేగంగా స్పందించాలి: లార్డ్ ఉదయ్ నాగరాజు
- ●రేవంత్ ఏడు సందేశాలు.. మూడు రాజకీయ లక్ష్యాలు!

Foreign Currency | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత..

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు

PM Kisan | రైతులకు శుభవార్త.. ఈనెల 30న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

ED Officials | లంచం తీసుకుంటూ.. సీబీఐకి పట్టుబడిన ఈడీ అధికారులు




