Lord Uday Nagaraju | దూసుకుపోతున్న ఏఐ టెక్నాలజీ.. పార్లమెంటరీ వ్యవస్థలూ అంతేవేగంగా స్పందించాలి: లార్డ్ ఉదయ్ నాగరాజు
Lord Uday Nagaraju | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దూసుకుపోతున్న వేగాన్ని, దాని విస్తృతిని అందుకోవడానికి పార్లమెంటరీ వ్యవస్థలు కూడా అంతే వేగంగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉందని యూకే పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణకు చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజు (Lord Uday Nagaraju) అన్నారు.
Lord Uday Nagaraju | త్రినేత్ర న్యూస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దూసుకుపోతున్న వేగాన్ని, దాని విస్తృతిని అందుకోవడానికి పార్లమెంటరీ వ్యవస్థలు కూడా అంతే వేగంగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉందని యూకే పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణకు చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజు (Lord Uday Nagaraju) అన్నారు. గత సెప్టెంబర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగంలో కీలక పరిణామాలు కొన్ని రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయని చెప్పారు. అయితే వాటిపై చర్చించేందుకు అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే అవకాశం లభించిందని యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అన్నారు. వేగంగా చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా పార్లమెంటును సన్నద్ధం చేసేందుకు, ఏఐ కల్పిస్తున్న అవకాశాలు, పొంచి ఉన్న ముప్పులు, ప్రభుత్వ నిబద్ధతలపై నిశిత పరిశీలన జరిపేందుకు ఒక వినూత్న ప్రతిపాదన వచ్చిందన్నారు.
ఇందులో భాగంగా ఒక టర్మ్ పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రతి వారం 30 నిమిషాల ప్రత్యేక 'ఏఐ సమీక్షా సమావేశాలను' నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనిని పరిశీలించేందుకు 'ప్రొసీజర్ అండ్ ప్రివిలేజెస్ కమిటీ' ముందుకు తీసుకెళ్లేందుకు సీనియర్ డిప్యూటీ స్పీకర్ సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. అదేవిధంగా ఏఐ అంశాలపై ఒక ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బారోనెస్ హార్మన్ సూచించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, ఏఐ సాంకేతికతపై పార్లమెంటరీ పర్యవేక్షణ, పారదర్శకత విషయంలో ప్రపంచ దేశాలకు బ్రిటన్ (UK) ఒక సరికొత్త ఆదర్శ ప్రమాణాన్ని నెలకొల్పినట్లవుతుందని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●రేవంత్ ఏడు సందేశాలు.. మూడు రాజకీయ లక్ష్యాలు!
- ●Monkey Attack | కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడి మృతి
- ●NHM Recruitment | రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండానే..
- ●Horoscope | అక్టోబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక సమస్యలతో మానసిక ఆందోళన!
- ●Farmer Alleges | గజ్వేల్‌లో మరో రైతుకు అవమానం.. ఎస్ఐ మల్లారెడ్డి కొట్టారంటూ రైతు ఆరోపణలు
- ●Revanth Reddy | కేసీఆర్‌ను, జగదీశ్ రెడ్డిని గుంజబాతి కొట్టినా తప్పులేదు

రేవంత్ ఏడు సందేశాలు.. మూడు రాజకీయ లక్ష్యాలు!

Monkey Attack | కోతుల దాడి భయంతో పరుగెత్తి బాలుడి మృతి

NHM Recruitment | రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండానే..

Horoscope | అక్టోబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక సమస్యలతో మానసిక ఆందోళన!






