త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Officials | లంచం తీసుకుంటూ.. సీబీఐకి ప‌ట్టుబ‌డిన ఈడీ అధికారులు

ED Officials | ఓ కేసులో స‌హాయం చేసేందుకు లంచం తీసుకుంటూ ఇద్ద‌రు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు (ED Officials) సీబీఐకి  (CBI) ప‌ట్టుబ‌డ్డారు. ల‌క్నోలోని ఈడీ జోన‌ల్ కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా (Bribery Case) ఈడీ అధికారి దీప‌క్ కుమార్‌, హెడ్ కానిస్టేబుల్ మ‌నోజ్ ద్వివేదిని అరెస్టు చేశారు.

G

National | Published On Oct 24, 2026, 7.56 am IST

ED Officials | లంచం తీసుకుంటూ.. సీబీఐకి ప‌ట్టుబ‌డిన ఈడీ అధికారులు
Advertisement

ED Officials | త్రినేత్ర న్యూస్‌: ఓ కేసులో స‌హాయం చేసేందుకు లంచం తీసుకుంటూ ఇద్ద‌రు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు (ED Officials) సీబీఐకి  (CBI) ప‌ట్టుబ‌డ్డారు. ల‌క్నోలోని ఈడీ జోన‌ల్ కార్యాల‌యంలో రూ.5 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా (Bribery Case) ఈడీ అధికారి దీప‌క్ కుమార్‌, హెడ్ కానిస్టేబుల్ మ‌నోజ్ ద్వివేదిని అరెస్టు చేశారు.

అగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో ఓ వ్య‌క్తికి ల‌క్నో (Lucknow) జోన్‌లోని ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీచేసింది. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌క్తికి అనుకూలంగా వ్య‌వ‌హరించేందుకు హెడ్ కానిస్టేబుల్ మ‌నోజ్ ద్వివేది .. అత‌ని కుమారుడిని లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.5 ల‌క్ష‌లు చెల్లించేందుకు అంగీక‌రించారు. దీంతో బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 23న కేసు న‌మోదుచేసిన సీబీఐ అధికారులు.. రూ.5 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుండ‌గా మ‌నోజ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అత‌నికి స‌హ‌క‌రించిన ఈడీ అధికారి దీప‌క్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో మ‌రికొంద‌రు అంధికారుల ప్ర‌మేయం ఉందా అనే కోణంలో ఇద్ద‌రు నిందితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ మ‌నోజ్ డిప్యుటేష‌న్‌పై ఈడీలో ప‌నిచేస్తున్న‌ట్లుగా గుర్తించారు.

కాగా, అంతర్జాతీయ సైబర్ మోసాలు, ఏటీఎం కార్డుల స్మగ్లింగ్ సిండికేట్‌కు చెందిన కీలక నిందితుడు ముహమ్మద్ ఫసల్‌ను కోజికోడ్‌లోని తామరస్సేరిలో ఉన్న‌ అతని నివాసంలో గ‌త శనివారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2024 జూలైలో త్రిసూర్‌కు చెందిన ఒక వ్యక్తిని ఫెడెక్స్ (FedEx) అధికారులుగా, సైబర్ క్రైమ్ పోలీసులుగా నమ్మించి.. బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ పేరుతో రూ.1,04,40,111 మోసం చేసిన కేసులో అత‌డు నిందితుడిగా ఉన్నాడు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement