Sridhar Babu | ముందు పుస్తకం చదివి మాట్లాడండి.. సోనియా ఆత్మకథపై బీజేపీకి శ్రీధర్‌బాబు కౌంటర్
Sridhar Babu | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Soniya Gandhi) రాసిన ఆత్మకథ (Autobiography) బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love)పై బీజేపీ (BJP) నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తప్పుబట్టారు.
Sridhar Babu | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Soniya Gandhi) రాసిన ఆత్మకథ (Autobiography) బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love)పై బీజేపీ (BJP) నాయకులు చేస్తున్న విమర్శలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తప్పుబట్టారు. ముందు పుస్తకంలో ఏముందో చదివి మాట్లాడాలన్నారు. కనీసం చదవకుండానే రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షుణ్ణంగా చదివిన తర్వాత మాట్లాడితే అర్థం ఉంటుందని, చదవకుండానే రాజకీయం చేయడం సరికాదని చురకలంటించారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. చారిత్రక పరిణామాలు, వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రాసిన ఆత్మకథపై వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడటం బీజేపీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
భారత్ సమ్మిట్ తెలంగాణకు ప్రయోజనకరం..
అనంతరం ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్ 2026’పై స్పందించారు. ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధికి గొప్ప ఊతాన్నిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇన్వెస్టర్లు, నిపుణులు వచ్చి కీలక అంశాలపై చర్చిస్తారు. ప్రపంచ విధానాలు, మారుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చిస్తాం. ప్రోగ్రెసివ్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్తాం. ప్రపంచ వ్యాప్తంగా 70 మంది నిపుణులు వస్తున్నారు. రాహుల్ గాంధీ విజన్ మేరకు భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పారిశ్రామిక విధానాలను చాటి చెప్పడానికి, రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి ఈ భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుంది అని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
నవంబర్ 10, 2026

Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి
నవంబర్ 10, 2026

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి రెండు పవర్ఫుల్ ఏఐ మోడల్స్.. వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..
- ●Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి
- ●Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
- ●Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు
- ●Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...

Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం

Anthropic | ఆంథ్రోపిక్ నుంచి రెండు పవర్ఫుల్ ఏఐ మోడల్స్.. వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..

Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే



