త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wipro | ఇన్వెస్ట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఐటీ షేర్ల‌ను కొని పెట్టుకోవాల‌న్న సిటీ గ్రూప్‌..

Wipro | ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi), విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల టార్గెట్ ధరలను పెంచినప్పటికీ, వాటిపై తన సెల్ రేటింగ్‌ను కొనసాగించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ కంపెనీల ఆదాయ వృద్ధి పరిమితంగానే ఉంటుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో షేర్ల విలువలు పెరుగుతున్నప్పటికీ, కంపెనీల ఆదాయ వృద్ధిలో గణనీయమైన మెరుగుదల కనిపించడం లేదని విశ్లేషించింది.

S

Business | Published On Nov 10, 2026, 4.00 pm IST

Wipro | ఇన్వెస్ట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. ఐటీ షేర్ల‌ను కొని పెట్టుకోవాల‌న్న సిటీ గ్రూప్‌..
Advertisement

Wipro | ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi), విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల టార్గెట్ ధరలను పెంచినప్పటికీ, వాటిపై తన సెల్ రేటింగ్‌ను కొనసాగించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ కంపెనీల ఆదాయ వృద్ధి పరిమితంగానే ఉంటుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో షేర్ల విలువలు పెరుగుతున్నప్పటికీ, కంపెనీల ఆదాయ వృద్ధిలో గణనీయమైన మెరుగుదల కనిపించడం లేదని విశ్లేషించింది.

ఐటీ షేర్ల‌కు టార్గెట్ ధ‌ర‌ల పెంపు..

భారత ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీలైన విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లపై సిటీ తన తాజా నివేదికలో కీలక అంచనాలను వెల్లడించింది. విప్రో టార్గెట్ ధరను రూ.145 నుంచి రూ.170కి, టీసీఎస్‌ను రూ.1,840 నుంచి రూ.2,000కి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ను రూ.1,050 నుంచి రూ.1,200కి పెంచింది. అయితే ఈ మూడు షేర్లపై గతంలో ఇచ్చిన సెల్ రేటింగ్‌ను మాత్రం మార్చలేదు. ఐటీ రంగంలో షేర్ల వాల్యుయేషన్లు మెరుగుపడటమే టార్గెట్ ధరల పెంపునకు ప్రధాన కారణమని, కంపెనీల ఆదాయ అంచనాల్లో పెద్దగా మార్పులు లేవని స్పష్టం చేసింది. విప్రో ప్రతి ఏడాది ఈపీఎస్ వృద్ధి 2029 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు 2 శాతానికే పరిమితం అవుతుంద‌ని అంచనా వేసింది. టీసీఎస్‌లో 2028-29 ఆర్థిక సంవత్సరాల్లో ఈపీఎస్ వృద్ధి 2 నుంచి 3 శాతం మధ్య ఉంటుంద‌ని పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విషయంలో 2027 ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా ఉండే ఈపీఎస్ వృద్ధి, 2028లో 2 శాతానికి, 2029లో కేవలం 1 శాతానికి తగ్గుతుంద‌ని అంచనా వేసింది.

ఇతర ఐటీ కంపెనీలపై అప్రమత్తత..

సిటీ తన జాగ్రత్త వైఖరిని ఇతర ఐటీ కంపెనీల విషయంలోనూ కొనసాగించింది. ఇన్ఫోసిస్‌పై రూ.1,105 టార్గెట్ ధరతో న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగించింది. ఆ కంపెనీ ఈపీఎస్ వృద్ధి 2027 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం నుంచి 2028లో 2.3 శాతానికి, 2029లో 0.6 శాతానికి తగ్గుతుంద‌ని అంచనా వేసింది. మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీలైన కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్‌పై సెల్ రేటింగ్ కొనసాగిస్తూ, టార్గెట్ ధరలను వరుసగా రూ.1,820, రూ.5,035కు పెంచింది. కోఫోర్జ్ ఆదాయ వృద్ధి 2027లో 50.7 శాతం నుంచి 2028లో 12.1 శాతానికి తగ్గుతుంద‌ని, పర్సిస్టెంట్ సిస్టమ్స్ వృద్ధి 27.4 శాతం నుంచి 13.6 శాతానికి పరిమితం అవుతుంద‌ని పేర్కొంది. టెక్ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (ఎల్‌టీఎం), ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ టార్గెట్ ధరలను కూడా పెంచినప్పటికీ సెల్ రేటింగ్‌ను కొనసాగించింది. మరోవైపు హెక్సావేర్ టెక్నాలజీస్ టార్గెట్ ధరను రూ.475 నుంచి రూ.470కు తగ్గించింది.

పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..

ఐటీ రంగంలో షేర్ల వాల్యుయేషన్లు మెరుగుపడుతున్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఆదాయ వృద్ధి మందగించడం ప్రధాన ఆందోళనగా ఉందని సిటీ నివేదిక వెల్లడించింది. అయితే ఐటీ షేర్ల‌ను స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని, కానీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, సొంత ప‌రిజ్ఞానం లేదా విశ్లేష‌ణ‌తో ముందుకు సాగాల‌ని, అవ‌స‌రం అయితే నిపుణుల స‌ల‌హా తీసుకోవాల‌ని సూచించింది. ఐటీ షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌స్తుతం సానుకూల ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్ప‌టికీ ప్రపంచ ప‌రిణామాలు, ముడి చ‌మురు ధ‌ర‌లు, డాల‌ర్ విలువ వంటివి రానున్న రోజుల్లో కీల‌కంగా మారుతాయ‌ని సిటీ గ్రూప్ అంచ‌నా వేసింది. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని సూచించింది.

Advertisement
Advertisement