త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka man murdered | యూఏఈలో భార‌తీయ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. మృత‌దేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి

Karnataka man murdered | యూఏఈ (UAE) షార్జా (Sharjah)లో ఉడుపి జిల్లాకు చెందిన అల్విన్ ప్ర‌కాష్ కుంద‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. దుండగులు అత‌డి మృత‌దేహాన్ని తొమ్మిది ముక్క‌లు చేసి రెండు సంచుల్లో కుక్కారు. మృతుడి భార్య‌, కుమారుడి ఆచూకీ తెలియ‌రాలేదు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

D

National | Published On Sep 23, 2026, 3.41 pm IST

Karnataka man murdered | యూఏఈలో భార‌తీయ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. మృత‌దేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి
Advertisement

Karnataka man murdered | త్రినేత్ర న్యూస్ : యూఏఈ (UAE)లో భార‌త్‌కు చెందిన ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు (Karnataka man murdered). మృతుడు క‌ర్ణాట‌క (Karnataka) రాష్ట్రం ఉడుపి (Udupi) జిల్లాకు చెందిన అల్విన్ ప్ర‌కాష్ కుంద‌ర్‌గా గుర్తించారు. అత‌డి మృత‌దేహాన్ని తొమ్మిది భాగాలుగా ముక్క‌లు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. అత‌డి భార్య, కుమారుడి ఆచూకీ తెలియ‌రాలేదు. షార్జా (Sharjah)లో జులైలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న రెండు నెల‌లు ఆల‌స్యంగా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

అల్విన్ ప్రకాష్ కుందర్ (Alwin Prakash Kunder) త‌న భార్య, కుమారుడితో క‌లిసి గత 14 ఏళ్లుగా షార్జాలోనే నివాసం ఉంటున్నాడు. అక్క‌డ‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌డి భార్య టీనా కుందర్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జులై నుంచి ప్ర‌కాష్ ఎవ‌రికీ అందుబాటులోకి రాలేదు. చివ‌రిసారిగా జులై 20న భార‌త్‌లో ఉంటున్న అత‌డి సోద‌రుడు అనిల్.. ప్ర‌కాష్‌కు కాల్ చేశాడు. కానీ ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఎంత ప్ర‌య‌త్నించినా అత‌డు అందుబాటులోకి రాలేదు. ఒక రోజు తాను బాగానే ఉన్నానంటూ ప్ర‌కాష్ ఫోన్ నుంచి అనిల్‌కు మెసేజ్ వ‌చ్చింది. దీంతో అత‌ను వెంట‌నే ప్ర‌కాష్‌కు వాట్సాప్ కాల్ చేసినా ఫ‌లితం లేదు.

దీంతో షార్జాలో ఉంటున్న ప్ర‌కాష్‌ స్నేహితుడు మ‌నోహ‌ర్‌కు అనిల్ కాల్ చేశాడు. త‌న సోద‌రుడు జులై నుంచి అందుబాటులోకి రాలేద‌ని, ఒక‌సారి ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి ఆరా తీయాల‌ని సూచించాడు. దీంతో మ‌నోహ‌ర్.. ప్ర‌కాష్ ఇంటికి వెళ్లాడు. అయితే, వాళ్లు ఇండియా వెళ్లిపోయిన‌ట్లు వాచ్‌మెన్ చెప్ప‌డంతో అత‌డు ప‌నిచేసే సంస్థ కార్యాల‌యానికి వెళ్లి ఆరా తీశాడు. అక్క‌డ సిబ్బంది కూడా ఇదే స‌మాధానం చెప్పింది. ఈ విష‌యాన్ని మ‌నోహ‌ర్.. అనిల్‌కు చెప్పాడు. అయితే, వారు ఇండియాకు రాలేద‌ని.. షార్జాలో కూడా లేక‌పోవ‌డంతో చివ‌రికి మ‌నోహ‌ర్ ద్వారా షార్జా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు న‌మోదు చేసిన పోలీసులు ప్ర‌కాష్ కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఒమ‌న్ వెళ్లే మార్గంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో అత‌డి మృత‌దేహాన్ని గుర్తించారు. దుండుగులు ప్ర‌కాష్ మృత‌దేహాన్ని తొమ్మిది భాగాలుగా ముక్క‌లు చేసి రెండు సంచుల్లో కుక్కారు. అత‌డి భార్య‌, కుమారుడి ఆచూకీ మాత్రం తెలియ‌రాలేదు. ఈ హ‌త్య వెనుక ప్ర‌కాష్ భార్య టీనా పాత్ర ఉండొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆమే త‌న భ‌ర్త‌ను హ‌త్య చేసి కుమారుడితో ఇండియాకి పారిపోయి ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అనిల్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌కాష్ మృతికి గ‌ల కార‌ణాలు, భార్య‌, కుమారుడి ఆచూకీ కోసం ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌కాష్ మృత‌దేహాన్ని భార‌త్‌కు తీసుకొచ్చేందుకు స‌హ‌క‌రించాల‌ని అత‌డి సోద‌రుడు అనిల్ ఉడుపి పోలీసుల‌ను కోరారు.

Also Read..

ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్‌చార్జ్‌గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా డీకే అరుణ

తెలంగాణ‌లో 1980 రోజులు.. రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ విమ‌ర్శ‌

Advertisement
Advertisement